లాకప్‌లో పెట్టి నాచేత ఆస్తులు రాయించుకోవాలనే: నాగసుశీలపై చింతలపూడి సంచలనం

ప్రముఖ సినీ నటుడు నాగార్జున సోదరి నాగ సుశీల తనపై ఫిర్యాదు చేయడంపై శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్ట్నర్ చింతలపూడి శ్రీనివాస్ స్పందించారు.

Recommended Video

    నాగార్జున ఫ్యామిలీ నుండి బెదిరింపులు వస్తున్నాయి

    హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నాగార్జున సోదరి నాగ సుశీల తనపై ఫిర్యాదు చేయడంపై శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్ట్నర్ చింతలపూడి శ్రీనివాస్ స్పందించారు. లాకప్‌లో పెట్టయినా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకే తనపై నాగ సుశీల కేసు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    తాను ఎలాంటి తప్పుడు లావాదేవీలకుపాల్పడలేదని చింతలపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తనకు రావాల్సిన డబ్బునే తీసుకున్నానని ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ తెలిపారు. తనపై తప్పుగా ఫిర్యాదు చేశారని అన్నారు. 2005-06లోనే భూములను రిజిస్టర్ చేయించామని చెప్పారు. ఆ డబ్బులున్నీ కంపెనీనే ఖర్చు చేసిందని, ఇప్పుడు ఫిర్యాదు చేయడం దారుణమని అన్నారు.

     సుశాంత్‌తో భారీ నష్టాలు

    సుశాంత్‌తో భారీ నష్టాలు

    నిధులు దుర్వినియోగం చేశాడని తనపై తప్పుగా ఫిర్యాదు చేశారని నాగ సుశీలపై ఆయన మండిపడ్డారు. కోర్టులో ఉన్న సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చేందుకే ఈ కేసు పెట్టారని అన్నారు. నాగ సుశీల కుమారుడు సుశాంత్ హీరోగా నాలుగు సినిమాలు తీసి భారీగా నష్టపోయామని వివరించారు. అయినా తాను ఎక్కడా మాట్లాడలేదని అన్నారు.

     అంతుచూస్తామన్నారు..

    అంతుచూస్తామన్నారు..

    తమది పెద్ద ఫ్యామిలీ అని మీ అంతుచూస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. నాగ సుశీలే తనకు బాకీ ఉన్నారని ఆయన తెలిపారు. తనను ఇబ్బందుల్లోకి నెట్టి తన చేత కంపెనీ ఆస్తులను రాయించేందుకునేందుకే నాగ సుశీల ఇప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.

     నాగార్జున జోక్యం..

    నాగార్జున జోక్యం..

    ఈ వ్యవహారంలో నాగార్జున ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోయినా, ఆయనకు తెలిసే ఇదంతా జరుగుతోందని శ్రీనివాసరావు అన్నారు. నాగార్జున స్నేహితుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని చెప్పారు. ఓ నిర్మాత కలగజేసుకుని నాగ సుశీల, తన మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారని చెప్పారు.

     నాగ సుశీల కేవలం పార్ట్నర్ మాత్రమే..

    నాగ సుశీల కేవలం పార్ట్నర్ మాత్రమే..

    దివంగత మహా నటుడు నాగేశ్వరరావు తనకు స్నేహితులని శ్రీనివాసరావు చెప్పారు. అందుకే సినిమాల్లో డబ్బులు పోయినా కూడా ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తన డబ్బులు పోయాయని ఎక్కడా చెప్పలేదని అన్నారు. తాను శ్రీనాగ్ ప్రొడక్షన్ కంపెనీకి మేనేజింగ్ పార్ట్నర్ అని, ఆమె కేవలం పార్ట్నర్ మాత్రమేనని చెప్పారు.

     డబ్బులు ఎగ్గొట్టేందుకే ఈ కేసు..

    డబ్బులు ఎగ్గొట్టేందుకే ఈ కేసు..

    తనకు ఇవ్వాల్సిన డబ్బులను ఎగ్గొట్టేందుకు ఇలా రివర్స్ కేసు తనపై పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగ సుశీల తనకు ఇచ్చే డబ్బులు వదిలేయాలి, ఆమె చెప్పిన షరతులకు ఒప్పుకోవాలి, కంపెనీ అప్పులు కూడా ఎగ్గొట్టాలనే తనపై ఈ కేసు పెట్టారని ఆయన ఆరోపించడం గమనార్హం. ఇలా చేస్తే కంపెనీ తన పేరున నడుస్తున్నందున తనకే చెడ్డపేరు వస్తుందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కంపెనీ పవర్ ఆఫ్ అటార్నీ కూడా శ్రీనివాసరావుకే ఉండటం గమనార్హం.

     ఆ సినిమాలతో భారీ నష్టాలు.. వినిపించుకోలేదు

    ఆ సినిమాలతో భారీ నష్టాలు.. వినిపించుకోలేదు

    ‘ఆటాడుకుందాం రా' సినిమాను తాను వద్దని చెప్పినా చేశారని, ఆ సినిమా విడుదలై భారీ నష్టాలను కంపెనీకి తెచ్చిపెట్టిందని శ్రీనివాసరావు వాపోయారు. బయ్యర్లు కూడా నష్టపోయారని వివరించాడు. అంతుకుముందు శ్రీనాగ్ ప్రొడక్షన్‌లో తీసిన కాళీదాసు, అడ్డా, కరెంటు చిత్రాలు కూడా కంపెనీకి నష్టాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.

     ఇప్పుడే మోసగాడ్ని అయ్యానా?.. నాగ్ ఫ్యామిలీ ఇలా.

    ఇప్పుడే మోసగాడ్ని అయ్యానా?.. నాగ్ ఫ్యామిలీ ఇలా.

    నాగ సుశీల తనను 12ఏళ్లుగా మంచోడని చెప్పి.. హఠాత్తుగా మోసం చేశారని ఆరోపణలు చేయడంలో ఆంతర్యం ఏమిటని శ్రీనివాసరావు ప్రశ్నించారు. తాను మోసకారిని అయితే, 12ఏళ్లపాటు ఎందుకు కలిసి కంపెనీలో ఉన్నారని నిలదీశారు. కంపెనీకి నష్టాలు వచ్చినా తాను ఆమెను పల్లెత్తు మాట కూడా అనలేదని చెప్పారు. ఇది ఇలావుంటే కోర్టులో కేసు ఉన్నందున తామేమీ మాట్లాడలేమని నాగ్ ఫ్యామిలీ చెబుతోంది.

    మోసం ఇలా చేశారంటూ.. శ్రీనివాస్‌కు నోటీసులు

    మోసం ఇలా చేశారంటూ.. శ్రీనివాస్‌కు నోటీసులు

    నాగసుశీల, శ్రీనివాస్‌ల మధ్య ప్రాఫిట్ డిస్ప్యూట్స్ ఉన్నాయని పంజాగుట్ట పోలీసులు తెలిపారు. శ్రీనాగ్ కార్పొరేషర్. ఎస్ఎస్ ప్రాపర్టీస్‌కు సంబంధించిన ఆస్తుల విషయంలో వీరి మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఎస్ఎస్ ప్రమోటర్స్ పేరిట శ్రీనివాసరావు, అతని భార్య మరో కంపెనీని స్థాపించి దుర్వినియోగానికి పాల్పడ్డారని నాగ సుశీల ఆరోపించారని చెప్పారు. శ్రీనివాస్ భాగస్వామిగా ఉన్న తమ కంపెనీకి చెందిన 37ఎకరాల భూమికి సంబంధించి కోర్టు స్టే ఇచ్చినా శ్రీనివాస్ అమ్మేందుకు ప్రయత్నించాడని సుశీల తన ఫిర్యాదు పేర్కొందని చెప్పారు. నాగ సుశీల ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. కేసులో పూర్తి విచారణ తర్వాత మిగితా వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

    నాగ సుశీల ఫిర్యాదులో ఏముందంటే..

    నాగ సుశీల ఫిర్యాదులో ఏముందంటే..

    తనతో వ్యాపార భాగస్వామిగా ఉన్న చింతలపూడి శ్రీనివాస్‌ అనే వ్యక్తి తనకు తెలియకుండా శంకర్‌పల్లిలో గల భూమిని విక్రయించాడని నాగసుశీల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తమ కంపెనీ ఎస్‌ఎస్‌ ప్రాపర్టీలో డబ్బులు దుర్వినియోగం చేయడంతో పాటు ఎస్‌ఎస్‌ ప్రెమిసెస్‌ పేరిట మరో కంపెనీని ప్రారంభించి మోసం చేశాడని నాగ సుశీల ఫిర్యాదులో వివరించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+