Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిజెపి,టిఆర్ఎస్ ప్రభుత్వాలను దించడమే చింతన్ శిబిర్ లక్ష్యం.!నవ సంకల్ప శిబిరంలో భట్టి.!

కీసర/హైదరాబాద్: దేశాన్ని విభజించి రాజకీయ అధికారం పొందాలని చూస్తున్న బిజెపిని, ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి దివాలా తీయించిన టిఆర్ఎస్ ప్రభుత్వాలను గద్దె దింపడానికి చింతన్ శిబిరం లో తీసుకునే నిర్ణయాలు ప్రజలను సమాయత్తం చేయడానికి దోహదపడతాయని సీఎల్పీ నేత, నవ సంకల్ప మేధోమధన శిబిరం చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం మేడ్చల్ జిల్లా కీసర లోని బాలవికాస్ లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న నవ సంకల్ప మేధోమధన శిబిర్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క ప్రసంగించారు.

 అధికారం కోసం మత విద్వేషాలను రెచ్చ గొడుతున్న బిజెపి.. నవ సంకల్ప శిబిరంలో భట్టి ఫైర్

అధికారం కోసం మత విద్వేషాలను రెచ్చ గొడుతున్న బిజెపి.. నవ సంకల్ప శిబిరంలో భట్టి ఫైర్


భిన్నత్వంలో ఏకత్వంగా భారత జాతిని కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే, దేశాన్ని విభజించి రాజకీయ అధికారం పొందాలని, తెలంగాణలో మత విద్వేషాలను సృష్టిస్తున్న బిజెపి కుట్రలను జాతి నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ వారసులుగా తిప్పికొట్టాలని ప్రజలకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. భారత దేశ సార్వభౌమాధికారానికి భిన్నంగా దేశంలో బీజేపీ సర్కారు పాలన సాగుతుందన్నారు. హిందూ దేశంగా మార్చాలని బిజెపి, భారత రాజ్యాంగాన్ని మార్చాలని టిఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మనందరిపైనా ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేసారు.

 ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించిన టిఆర్ఎస్ సర్కార్.. కాంగ్రెస్ పార్టీ గద్దె దించుతుందన్న సీఎల్పీ నేత

ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించిన టిఆర్ఎస్ సర్కార్.. కాంగ్రెస్ పార్టీ గద్దె దించుతుందన్న సీఎల్పీ నేత


దేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రను వక్రీకరించే విధంగా నవభారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ ఫోటో లేకుండా ఆజాదికా అమృత్ ఉత్సవాలు నిర్వహించే అధికారం బిజెపికి ఎవరిచ్చారని భట్టి విక్రమార్క నిలదీశారు. కాంగ్రెస్ పై ఆర్ఎస్ఎస్ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టి చరిత్రలు కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనందరిపైనా ఉందని వెల్లడించారు. ఉదయపూర్ చింతన్ శిబిర్ నిర్ణయాలు, వరంగల్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ తీసుకునే విధానపరమైన నిర్ణయాలను అమలు చేయడంలో ప్రజలను భాగస్వాములను చేయాలని భట్టి విక్రమార్క కోరారు.

 భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.. స్పష్టం చేసిన భట్టి

భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.. స్పష్టం చేసిన భట్టి

సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని, గతంలో అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటించిందన్నారు. భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయం అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందన్న ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు భట్టి విక్రమార్క. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎదురు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చి అధికారంలోకి రావడంతో పాటు సామాజిక రుగ్మతలపై యుద్ధం చేసి సామాజిక మార్పులు చేసిందన్నారు భట్టి విక్రమార్క.

 ఉదయపూర్,వరంగల్ డిక్లరేషన్ ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి.. భట్టి వినూత్న పిలుపు

ఉదయపూర్,వరంగల్ డిక్లరేషన్ ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి.. భట్టి వినూత్న పిలుపు


అసమానతలు లేని జాతి నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా కృషి చేస్తుందని భట్టి విక్రమార్క వివరించారు. ఎఐసిసి ఆదేశాల మేరకు బుదవారం,గురువారం కీసరలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న నవ సంకల్ప్ మేథో మధన శిబిర్ సమావేశాలల్లో భాగంగా పతాకవిష్కరణ చేసి గౌరవ వందనం చేసారు భట్టి విక్రమార్క. ఈ సమావేశాలు తెలంగాణలో చారిత్రాత్మకంగా నిలిచిపోతాయని అన్నారు. ఈ శిబిరానికి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మానిక్కం ఠాగూర్, ఎఐసిసి కార్యదర్శి బోసురాజు, శ్రీనివాస కృష్ణన్ టిపిసిసి ముఖ్య నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజరైయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+