తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన చిరంజీవి దంపతులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గురువారం కలిశారు. చిరంజీవి తన భార్యతో కలిసి మల్లు భట్టిని ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లు భట్టికి మెగాస్టార్ బొకే ఇవ్వగా... చిరంజీవిని ఆయన శాలువా కప్పి సత్కరించారు. మెగాస్టార్-ఉప ముఖ్యమంత్రి భేటీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారిని ప్రజాభవన్ లో కలిసిన ప్రముఖ సినీ నటుడు శ్రీ చిరంజీవి గారి దంపతులు@KChiruTweets #BhattiVikramarkaMallu #Chiranjeevi pic.twitter.com/0I71tmNCDf
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) January 4, 2024
కాగా, ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చిరంజీవి మర్యాద పూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నేడు డిప్యూటీ సీఎం భట్టిన కలిశారు చిరంజీవి. గత వారం తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చిరంజీవి కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

తన ఇంటికి వచ్చిన చిరంజీవిని రేవంత్ ఆప్యాయంగా ఆహ్వానించారు. వీరిద్దరూ కాసేపు పలు విషయాలపై మాట్లాడుకున్నారు. రేవంత్ పేరును సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన వెంటనే... ముందుగా ఆయనను చిరంజీవి అభినందించారు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారిని ప్రజాభవన్ లో కలిసిన ప్రముఖ సినీ నటుడు శ్రీ చిరంజీవి గారి దంపతులు@KChiruTweets #BhattiVikramarkaMallu #Chiranjeevi pic.twitter.com/m11XTpPBsX
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) January 4, 2024












Click it and Unblock the Notifications