అల్లు అర్జున్‌కు చిరంజీవి కౌంటర్..? టాలెంట్ ఉంటే సరిపోదంటూ

హైదరాబాద్‌లో హైటెక్స్ వేదికగా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్-2025 ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు.ఈ సమయంలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఒక స్థాయికి ఎదగాలంటే ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాటిని చూసి వెనుకడుగు వేయొద్దని చిరంజీవి సూచించారు. ఈ నేపథ్యంలో కష్టాన్ని మాత్రమే నమ్ముకుని లక్ష్యం వైపు పయనం సాగించాలని ఆయన తెలిపారు.

సమాజంలో విస్తృతంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని యువతకు చిరంజీవి సూచించారు. ప్రతిభ ఉంటే సరిపోదు.. ప్రవర్తన కూడా బాగుంటేనే ఏ రంగంలోనైనా రాణించవచ్చని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసి ఉంటారని మెగా అభిమానులు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గత కొంతకాలంగా అల్లు అర్జున్‌ను మెగా ఫ్యామిలీ దూరం పెడుతూ వస్తోంది. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ జనసేన పార్టీని కాదని, వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడంతో వీరి మధ్య దూరం పెరిగింది.

Chiranjeevi key comments at the Catalyst Global Business Conference-2025

ఇదే సమయంలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈక్రమంలో రేవతి అనే ఓ మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై ఎఫ్ఐర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

ఒకరాత్రి ఆయన చర్లపల్లి జైలులోనే గడపాల్సి వచ్చింది. భారీ ట్విస్ట్‌ల మధ్య అల్లు అర్జున్ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో బెయిల్ వచ్చిన వెంటనే అల్లు అర్జున్ చిరంజీవి నివాసానికి చేరుకుని ఆయనతో సమావేశం అయ్యారు. అయితే అల్లు అర్జున్ ఘటనపై చిరంజీవి ఎక్కడా కూడా స్పందించలేదు. అటు పవన్ కల్యాణ్ సైతం హైదరాబాద్‌కు వచ్చి కూడా అల్లు అర్జున్‌ను కలవకుండానే వెళ్లిపోయారు. దీంతో వీరి మధ్య సయోధ్య కుదరలేదని అంతా భావిస్తున్నారు.ఈ సమయంలోనే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+