సజ్జనార్ ను కలిసిన చిరంజీవి, టెన్షన్ లో బాలయ్య ఫ్యాన్స్.. అనూహ్య పరిణామం!
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గతంలో ఆర్టీసీ ఎండీగా పనిచేసిన సజ్జనార్, మళ్లీ పోలీస్ యూనిఫామ్ ధరించగానే తన మార్క్ శాంతి భద్రతల పరిరక్షణ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ సీపి గా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ను మెగాస్టార్ చిరంజీవి వెళ్లి కలవడం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సజ్జనార్ ను కలిసిన చిరంజీవి
ఇటీవల బాలకృష్ణ వ్యాఖ్యలతో, చిరంజీవి బాలయ్య మధ్య చోటుచేసుకున్న వివాదం వేళ సజ్జనార్ ను చిరంజీవి ఎందుకు కలిశారు అన్నది బాలకృష్ణ ఫ్యాన్స్ లో ఆందోళనకు కారణమైంది. హైదరాబాద్ సీపీ గా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ఇప్పటికే హైదరాబాద్ నగరంలో తనదైన శైలిలో మార్పులు తీసుకు వస్తున్నారు. ఆయన సోషల్ మీడియా పోస్టులు పెడుతూ మహిళలపై వేధింపులకు గురి చేసే వారిపైన, సైబర్ నేరాల పైన ప్రత్యేకమైన దృష్టి సారించారు.

మళ్ళీ కొనసాగుతున్న సజ్జనార్ మార్క్ పాలన
ప్రతి ఒకరు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అనవసరంగా కటకటాల పాలు కావద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడొద్దని ప్రజలకు సూచించారు. ఎవరైనా సరే నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఇక బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయన దూకుడు చూసినవారు మళ్లీ సజ్జనార్ మార్క్ పాలన కొనసాగుతుందని అభిప్రాయపడుతున్నారు.
గతంలో సజ్జనార్ తో కలిసి పని చేసిన చిరంజీవి
ఇదే సమయంలో అనూహ్యంగా హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను మెగాస్టార్ చిరంజీవి కలిసారు. గతంలో సజ్జనార్ తో కలిసి పని చేసిన చిరంజీవి, ప్రజలలో అనేక విషయాలపైన అవగాహన తీసుకువచ్చారు. సైబరాబాద్ సిపి గా సజ్జనార్ ఉన్నప్పుడు కరోనా సమయంలో ప్లాస్మా దానం చెయ్యాల్సిన ఆవశ్యకతను ప్రజలకు చిరంజీవి వివరించారు.
టెన్షన్ పడిన బాలయ్య ఫ్యాన్స్
ఈ అనుబంధం నేపథ్యంలో మళ్లీ సజ్జనార్ ను చిరంజీవి కలిసారు. అయితే ఆయన మర్యాదపూర్వకంగానే చిరంజీవిని కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి సజ్జనార్ ను కలవడంతో ఎందుకు కలిశారో అర్థం కాక కాస్త టెన్షన్ పడ్డారు.












Click it and Unblock the Notifications