దాసరి-చిరంజీవి ఆత్మీయ ఆలింగనం, కేసీఆర్‌పై 'చిరు' ప్రశంస

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణ రావు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిలు శనివారం నాడు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ అరుదైన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది.

ఆల్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వేదిక పైన దాసరి, చిరంజీవిలు వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. చిరంజీవిని మా అబ్బాయి అంటూ దాసరి పేర్కొనడం గమనార్హం. వీరి మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

కేసీఆర్ పైన చిరు ప్రశంసలు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన చిరంజీవి ప్రశంసలు కురిపించారు. సిని పరిశ్రమ అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. కాగా, చిరంజీవి తెలంగాణ సీఎం కెసిఆర్‌ను మెచ్చుకోవడం ఓ వైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ కాగా, మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుకు చురకలుగా భావించవచ్చంటున్నారు.

Chiranjeevi praises TS CM KCR

రైతులకు పరిహారంపై కాంగ్రెస్ డిమాండ్

తెలంగాణలో కట్టే ప్రాజెక్టుల ద్వారా భూములు కోల్పోయే రైతులకు ఎకరానికి రూ.20 లక్షల నుంచి 30లక్షల వరకు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి శనివారం డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. జీవన్ రెడ్డి డిమాండుపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

చిత్తశుద్ధితో ప్రాజెక్టులు నిర్మిస్తుంటే రైతులను రెచ్చగొట్టి, ప్రాజెక్టులు కట్టకుండా కుటిలప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ప్రాజెక్టులు పూర్తయి పొలాలు పచ్చబడితే పుట్టగతులుండవనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+