చిట్టీ డబ్బులు అడిగితే పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుల అరెస్ట్ .. చిట్ ఫండ్ సంస్థలకు సీపీ వార్నింగ్
చిట్టి డబ్బులు అడిగినందుకు హన్మకొండ జిల్లాలో జరిగిన దారుణం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది . చిట్టీ డబ్బులు అడిగినందుకు ఆగ్రహంతో ఓ జంట చేసిన ఘాతుకం ఒక్కసారి అందరినీ నివ్వెరపరిచింది. సెల్ ఫోన్ షాపుకు నిప్పు పెట్టిన, షాపు యజమానిని సజీవ దహనం చేయడానికి యత్నించిన సంఘటనలో నిందితులైన భార్యభర్తలను హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్టి డబ్బులు అడిగినందుకు దారుణానికి పాల్పడిన అచల చిట్ ఫండ్ కంపెనీ ఏజెంట్ గణేష్ తో పాటు గణేష్ భార్య కావ్యను హన్మకొండ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరి నుండి పోలీసులు ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

చిట్టీ డబ్బుల కోసం ఏజెంట్ తో బాధితుడి గొడవ
వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి నిందితుల అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా, తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. నిందితుడు గొడుగు గణేష్ అచల చిట్ ఫండ్ కంపెనీలో ఏజెంట్ గా పనిచేస్తుండేవాడు. ఇతని ద్వారా భాధితుడు సెల్ ఫోన్ షాపు నిర్వహకుడు పిట్టల రాజు అచల చిట్‌ఫండ్ కంపెనీలో ఐదు లక్షల చిట్ వేశాడు. ఇటీవల భాధితుడు రాజు తన చిట్టీని పాడుకున్నాడు. చిట్టి పాట డబ్బు కోసం భాధితుడు పలుమార్లు అచల చిట్ ఫండ్ చుట్టూ తిరగగా, చివరగా భాదితుడికి చిట్ ఫండ్ కంపెనీ మూడు బ్యాంక్ చెక్కులను ఇచ్చింది. అందులో ఒక చెక్కుకు మాత్రమే కొంత మొత్తం డబ్బు రాగా మిగితా రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీనితో భాధితుడు రాజు మిగితా చిట్టి డబ్బుల గురించి చిట్ ఫండ్ కంపెనీ కాకుండా, ఏజెంట్ గణేష్ ను భాధ్యుడుని చేస్తూ పలుమార్లు గొడవకు దిగాడు.
రెండు రోజుల క్రితం గణేష్ ఇంటికి వెళ్లి గొడవకు దిగిన రాజు .. ప్లాన్ ప్రకారమే దాడి
ఇందులో భాగంగా భాధితుడు రాజు 2 రోజుల క్రితం నిందితుడు గణేష్ ఇంటి వెళ్ళి గట్టిగా ఘర్షణ పడ్డాడు. తామేదో బాకీ ఉన్నట్టు, తమ ఇంటికి వచ్చి చిట్టి డబ్బులు కోసం గొడవ చేస్తున్న రాజుపై ఆగ్రహం పెంచుకున్న గణేష్ తన భార్య కావ్యను రాజుపై దాడికి పురికొల్పాడు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నింపుకున్న సీసాతో పాటు ఒక లైటర్‌ను తన బ్యాగ్ లో పెట్టుకోని నిన్న నిందితురాలు కావ్య కాంగ్రెస్ భవన్ ప్రక్క సందులోని భాధితుడు సెల్ ఫోన్ షాపుకు వెళ్ళి రాజు దంపతులతో గొడవకు దిగారు. అంతటితో ఆగక సెల్ ఫోన్ షాపు పై, రాజు పై దాడి చేసింది. పెట్రోల్ పోసి నిప్పంటించింది . హాహాకారాలు చేస్తూ రాజు రోడ్డుపై పరుగులు పెట్టిన దృశ్యాలు అందరినీ షాక్ కు గురి చేశాయి. ఈ ఘటన తర్వాత కావ్య అక్కడి నుండి పారిపోయింది.
దాడి చేసి తప్పించుకు తిరుగుతున్న దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు .. నేరం అంగీకరించిన నిందితులు
పెట్రోల్ తో దాడి చేసిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన రాజు ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై దర్యాప్తు నిర్వహించిన హన్మకొండ పోలీసులు నిందితులను గుర్తించడం జరిగింది. ఈ రోజు ఉదయం నిందితులైన భార్యభర్తలు ఎనమాములకు వేళ్ళే కాశీబుగ్గ క్రాస్ రోడ్డు వున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందటంతో పోలీసులు వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకోని విచారించారు. దీంతో వారు చేసిన నేరాన్ని పోలీసుల ముందు అంగీకరించారు. తమ ఇంటికి వచ్చి రాజు గొడవ చేస్తున్న క్రమంలోనే దాడి చేసినట్టు వెల్లడించారు.
Recommended Video

చిట్ ఫండ్ సంస్థలకు సిపి వార్నింగ్
ఇక చిట్ ఫండ్ సంస్థల తో ఎలాంటి సమస్యలు ఉన్నా, డబ్బులు చెల్లించకుండా చిట్ ఫండ్ సంస్థలు వేధిస్తున్నా పోలీసుల దృష్టికి తీసుకు రావాలని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి విజ్ఞప్తి చేశారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని పేర్కొన్నారు. ఇక చిట్ ఫండ్ సంస్థల యాజమాన్యాలు సైతం సభ్యులను వేధింపులకు గురి చేస్తే, ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ వార్నింగ్ ఇచ్చారు. చిట్ ఫండ్ కంపెనీ సకాలంలో డబ్బులు చెల్లించినట్లైతే ఈ దారుణం జరిగి ఉండేది కాదని, చిట్ ఫండ్ సంస్థల వేధింపులు అనేక అనర్థాలకు కారణమవుతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications