కోల్‌కతా యువతిని వివస్త్రను చేసి కొరియోగ్రాఫర్ సహా రేప్: కుర్చీలో కట్టేసి, వీడియో తీసి...

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలో అత్యాచారానికి గురైన కోల్‌కతా యువతిపై మూడు రోజులు అత్యాచారానికి పాల్పడ్డారు. 15 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దారుణానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 17న ప్రీత్, అతని కారు డ్రైవర్ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

అనంతరం ఆమెను వివస్త్రను చేసి కుర్చీలో కట్టేసి ఫోటోలు, వీడియోలు తీశారు. స్నేహితులకు వీడియో కాల్స్ చేసి ఇంటికి తాళం వేసి వెళ్లారు. వాళ్లు బయటకు వెళ్లాక ఆ యువతి ఓ కాగితంపై 'అయాం ఇన్ ట్రబుల్' అంటూ రాసి కిటికీలో నుంచి విసిరేసింది.

ఎవరూ రాకపోవడంతో అతి కష్టం మీద కట్లు విప్పుకొని ఇంటి నుంచి బయట పడింది. కోల్‌కతా వెళ్లే సమయంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల అనంతరం కోల్‌కతా వెళ్లింది.

మూడు రోజులు బంధించి, కోల్‌కతా అమ్మాయిపై హైదరాబాదులో గ్యాంగ్ రేప్

బాధితురాలు పారిపోవడం, అయాం ఇన్ ట్రబుల్ అని రాసి విసిరిన కాగితాన్ని చూసిన నిందితులు.. పోలీసులకు విషయం తెలుసునేమోనని భయపడి పరారీలో ఉన్నారు.

ఫిబ్రవరి 16న ఉదయం ఇంటికి వచ్చిన ప్రీత్‌ కారు డ్రైవర్‌ సుల్తాన్‌, సాయంత్రం ఇంటికొచ్చిన ప్రీత్‌ స్నేహితులిద్దరిలో ఒకరు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఫిబ్రవరి 17న కూడా ప్రీత్‌, అతని డ్రైవర్‌ యువతిపై అఘాయిత్యం చేశారు.

కేసు బదలీ

కేసు బదలీ

అత్యాచార ఘటన మారేడ్‌పల్లి ప్రాంతంలో జరిగిన నేపథ్యంలో విమానాశ్రయ పోలీసులు కేసును వెస్ట్ మారెడ్‌పల్లి పోలీసులకు బదిలీ చేశారు. నిఘా ఉంచిన పోలీసులు శుక్రవారం రాత్రి ఇంటికొచ్చిన ప్రీత్‌ షెర్గిల్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన, దానికి సహకరించిన మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.

మాయమాటలతో....

మాయమాటలతో....

కాగా, హైదరాబాద్‌లో పర్యాటక ప్రాంతాలను చూసేందుకు కోల్‌కతా నుంచి వచ్చిన యువతి (19) పట్ల నలుగురు దారుణంగా ప్రవర్తించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసిన విషయం తెలిసిందే. మాయమాటలతో నమ్మించి, పథకం ప్రకారం గదిలో బంధించి మరీ అత్యాచారం చేశారు.

ప్రధాన నిందితుడు ప్రీత్‌ షెర్గిల్‌(39)ను పోలీసులు అరెస్టు చేయడంతో రెండున్నర నెలల క్రితం జరిగిన ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

క్యాబ్‌లో వెళ్తుంటే.... నమ్మించి మోసం: మాట కలిపి..

క్యాబ్‌లో వెళ్తుంటే.... నమ్మించి మోసం: మాట కలిపి..

హైదరాబాద్‌లో పర్యటించేందుకుగాను కోల్‌కతాకు చెందిన, బీకాం చదువుతున్న యువతి(19) ఫిబ్రవరి 14న శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చింది. తాను బసచేయబోయే హోటల్‌కు షేరింగ్‌ క్యాబ్‌లో బయల్దేరింది. యువతి నగర పర్యటనకు వచ్చినట్టు తెలుసుకున్న తోటి ప్రయాణికురాలు పింకీ రాయ్‌ ఆమెతో మాట కలిపింది. తెలిసిన స్నేహితుడికి కారు ఉందని, అందులో ఇద్దరం నగర పర్యటనకు వెళ్దామంటూ నమ్మించింది.

ప్రీత్ కారులో..

ప్రీత్ కారులో..

మరుసటి రోజు (ఫిబ్రవరి 15న) ఇద్దరూ అమీర్‌పేటలోని హోటల్‌లో కలుసుకున్నారు. తర్వాత పింకీ నృత్య దర్శకుడు, ఈవెంట్‌ మేనేజర్‌ ప్రీత్‌ షెర్గిల్‌కు ఫోన్ చేసి అక్కడికు రప్పించింది. అనంతరం ప్రీత్‌ కారుతో ముగ్గురూ బయల్దేరారు. ప్రీత్‌ సూచనలతో పింకీ మార్గమధ్యలో దిగింది.

ఆయన యువతిని వెస్ట్ మారేడ్‌పల్లి, కృష్ణపురి కాలనీలోని మిష్ మాన్షన్‌ ఆపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. పథకం ప్రకారం కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చాడు. మత్తులోనే యువతి ఇంట్లోంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా, బెదిరించి మరీ అత్యాచారం చేశాడు. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 19-year old girl from Kolkata was reportedly confined in a flat in Hyderabad and was sexually exploited by a cinema choreographer, his servant and a friend.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి