ఎంసెట్ 3: 70 మంది తప్పుకు 50 వేల మందికి శిక్షనా?, జేఎన్యూ ప్రొఫెసర్‌పై డౌట్
హైదరాబాద్: ఎంసెట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించవచ్చుననే వార్తల నేపథ్యంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు ఏకంగా మంత్రి లక్ష్మారెడ్డి వద్ద కంటతడి పెట్టారు. యాభై, అరవై మంది కోసం వేలాది మంది విద్యార్థులను మళ్లీ ఇబ్బంది పెట్టవద్దన్నారు.
ప్రశ్నాపత్రం లీకేజీ నేపథ్యంలో కౌన్సిలింగ్ జరుగుతుందో లేదోననే ఆందోళనలో తెలంగాణ ఎంసెట్ 2 పరీక్ష రాసిన విద్యార్థులు ఉన్నారు. తొలుత ఎంసెట్ రాసిన తాము నీట్ పరీక్ష వివాదం నేపథ్యంలో ఆందోళన చెందామని అన్నారు.
నీట్ వివాదం సద్దుమణగడంతో మళ్లీ పరీక్షకు సంసిద్ధమై ర్యాంకులు సాధించుకున్నామని విద్యార్థులు అంటున్నారు. ర్యాంకులు వచ్చాయని, ఇక కోర్సులో కౌన్సెలింగ్ తరువాయి అనుకున్న తరుణంలో ఎంసెట్ 2 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
కేవలం 72 మంది చేసిన తప్పుకు అరవై వేల మందికి శిక్ష విధించవద్దని విద్యార్థులు కోరుతున్నారు. కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఎంసెట్ 3 అంటే ఎలా అంటున్నారు. మళ్లీ కొత్తగా చదవాలంటే తమపై చాలా ఒత్తిడి నెలకొంటుందన్నారు.
ఈసారి మంచి ర్యాంకులు వస్తాయన్న నమ్మకం తమలో సన్నగిల్లుతోందని, ఇప్పటికే చాలామంది మెటీరియల్‌ను జూనియర్స్‌కు ఇచ్చేశారని చెబుతున్నారు. కౌన్సిలింగ్ ప్రారంభించాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఎంసెట్ 2 ప్రశ్నపత్రాల బహిర్గతంపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులకు ఎంసెట్-1 ప్రశ్నపత్రం కూడా లీక్ అయ్యిందన్న విషయం తెలిసింది. ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక పెద్ద ముఠా హస్తమే ఉందని నిర్ధారణ అయింది.
ప్రశ్నపత్రాలను ముద్రణ కేంద్రం నుంచి చాకచక్యంగా తీసుకురావటం మొదలు వాటిని అత్యంత పకడ్బందీగా విద్యార్థులకు చేర్చటం, వారి నుంచి డబ్బు వసూలు చేయటం వరకు జరిగిన ఈ భారీ కుంభకోణంలో రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు సీఐడీ నిర్ధారించింది.
ఈ మొత్తం వ్యవహారంపై బుధవారమే డీజీపీ అనురాగ్ శర్మ మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. గురువారం పూర్తిస్థాయి నివేదిక అందజేయనున్నారు. ఎంసెట్ 2 ప్రశ్నపత్రం ముందుగానే బహిర్గతమైనట్లు తేలటంతో ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన నిందితులను సీఐడీ అదుపులోకి తీసుకుంది.
కేసు నమోదు చేసిన మూడు రోజుల్లోనే సీఐడీ మొత్తం కుట్రను ఛేదించింది. కుట్రదారులతో ఒప్పందం కుదర్చుకొని డబ్బు చెల్లించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నిందితులుగా ఈ కేసులో సీఐడీ చేర్చనుంది.
సీఐడీ విచారణలో ఎంసెట్ 2నే కాదు, ఎంసెట్ 1 ప్రశ్నపత్రం కూడా బహిర్గతం చేసినట్లు రాజగోపాల్ రెడ్డే స్వయంగా వెల్లడించినట్లుగా తెలుస్తోంది. వైద్యవిద్య ప్రవేశపరీక్షే తన క్ష్యమని, దీనిలో భాగంగానే ఎంసెట్ 1 ప్రశ్నపత్రం కూడా సంపాదించామని అధికారులు చెబుతున్నారని అంటున్నారు.
జేఎన్టీయూ ప్రొఫెసర్ పై అనుమానం
ఎంసెట్ లీకేజీలో జేఎన్టీయూ ప్రొఫెసర్ హస్తం ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిందితులు సీఐడీ విచారిస్తున్న సమయంలో షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. వారి కాల్ లిస్టును పరిశీలించగా.. అందులో ఓ ప్రొఫెసర్ నంబర్ ఉందని సమాచారం. మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నెంబర్లు ఉన్నాయి. వీరు నిందితులతో పలుమార్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. జేఎన్యూ నిర్లిప్తత కూడా లీక్‌కు కారణమంటున్నారు.

పేరెంట్స్
ఎంసెట్ 2ను రద్దు చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 70 మంది విద్యార్థుల కోసం వేలాది మంది విద్యార్థులను ఆందోళనకు గురి చేయవద్దని మంత్రికి చెప్పేందుకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు.

పేరెంట్స్
ఎంసెట్ 2ను రద్దు చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 70 మంది విద్యార్థుల కోసం వేలాది మంది విద్యార్థులను ఆందోళనకు గురి చేయవద్దని మంత్రికి చెప్పేందుకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు.

మంత్రి లక్ష్మా రెడ్డి
ఎంసెట్ ప్రశ్నపత్రాల లీకేజీపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సచివాలయంలో మాట్లాడారు. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ జరుపుతోందని చెప్పారు.

మంత్రి లక్ష్మా రెడ్డి
సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందిన వెంటనే ఏం చేయాలనే దానిపై నిర్ణయిస్తామని లక్ష్మా రెడ్డి తెలిపారు. ఎంసెట్ 2ను రద్దే చేసే అంశంపై విలేకరులు ఆయనను ప్రశ్నించారు.

మంత్రి లక్ష్మా రెడ్డి
ఎంసెట్ లీకేజీ పైన సీఐడీ నివేదిక గురువారం ప్రభుత్వానికి అందే అవకాశముందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, ఇప్పుడేమీ చెప్పలేమని మంత్రి లక్ష్మా రెడ్డి అన్నారు.

మంత్రి లక్ష్మా రెడ్డి
అక్రమార్కుల ర్యాంకులను పక్కనబెట్టి, న్యాయంగా ర్యాంకులు పొందినవారిని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా... మాల్‌ప్రాక్టీస్ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు.

మంత్రి లక్ష్మా రెడ్డి
ఇదిలా ఉండగా, ఎంసెట్ 2ను రద్దుచేసి మరో పరీక్షను నిర్వహించే క్రమంలో కన్వీనర్ ఎన్వీ రమణారావును ప్రభుత్వం తప్పించి, కొత్త కన్వీనర్‌ను నియమించటనుందని అంటున్నారు.

సీఐడీ ఆఫీస్
పరీక్ష నిర్వహణ బాధ్యతను మాత్రం మళ్లీ జేఎన్‌టీయూహెచ్‌కే అప్పగించనున్నారు. కన్వీనర్‌గా రమణా రావునే కొనసాగిస్తే విమర్శలు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

సీఐడీ ఆఫీస్
ఎంసెట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించవచ్చుననే వార్తల నేపథ్యంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు ఏకంగా మంత్రి లక్ష్మారెడ్డి వద్ద కంటతడి పెట్టారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications