డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఊరట
హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. టాలీవుడ్ లింక్స్ మరోసారి బయటపడ్డాయి. డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌కు నోటీసులు జారీ అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో.. స్వల్ప ఊరట లభించింది. సెప్టెంబర్ 19 వరకు నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌ను 29వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. దీంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నవదీప్ కోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు.. సెప్టెంబర్ 19 వరకు నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం
టాలీవుడ్ దర్శకుడి అరెస్టుతో మళ్లీ మొదలైన డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. తాజాగా, మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు నైజీరియన్లు ఉన్నారు. నైజీరియన్లు ఆమోబీ, మైఖేల్, థామస్, సినీ దర్శకుడు సుశాంత్ రెడ్డి, ఇండస్ట్రీతో సంబంధం ఉన్న రాంచందర్, దేవరకొండ సురేశ్ రావు, ఖమ్మం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సందీప్, శ్రీకర్ కృష్ణప్రణీత్‌లను నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అరెస్ట్ చేసింది.
సురేశ్ రావు వద్ద 4 గ్రాముల డ్రగ్స్ దొరికింది. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిర్మాత ఉప్పలపాటి రవి, స్నార్ట్ పబ్ ఓనర్ సూర్య, బిస్త్రా, టెర్రా కేఫ్ ఓనర్ అర్జున్, విశాఖపట్నం వాసి కలహర్ రెడ్డి, మరో ఐదుగురు డ్రగ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న మరో ముగ్గురు నైజీరియన్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
సినీ నటుడు నదవీప్‌కు డ్రగ్స్ చేరేవని పోలీసులు తెలిపారు. అందుబాటులో లేడని పోలీసులు చెబుతుండగా.. తాను ఎక్కడికి పారిపోలేదని నవదీప్ తెలిపారు. తనను పోలీసులు అప్రోచ్ కాలేదని అన్నారు. అయితే, ముందస్తు బెయిల్ కోసం మాత్రం హైకోర్టును ఆశ్రయించారు నవదీప్. దీంతో కోర్టు 19 వరకు అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications