హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాల్పులతో దద్దరిల్లిన శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అది శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం. ఉదయం 11.00 గంటలు. అక్కడక్కడ వచ్చిపోయే ప్రయాణికులు. సిబ్బంది ఎవరి పనుల్లో వారున్నారు. ఇంతలో సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొరబడ్డారు.

అధునాతన ఆయుధాలతో కాల్పులు జరుపుకుంటూ విమానాశ్రయం ప్రధాన ద్వారం వైపు ఉన్న పార్కింగ్ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంతలో పార్కింగ్ ప్రాంతంలోని వాటర్‌ఫాల్స్ షో సైడ్ రోడ్డుపైకి రయ్.. రయ్‌మంటూ ఓ మినీ బస్సు ప్రయాణికులతో అక్కడికి వచ్చింది.

అక్కడే ప్రయాణికుల్ని తీసుకెళ్లేందుకు ఆగి ఉన్న బస్సులోకి నలుగురు ఉగ్రవాదులు చేతుల్లో ఏకే-47 తుపాకులతో నోటికి వచ్చినట్టు గట్టిగా అరుస్తూ బస్సులోకి ఇద్దరు ప్రవేశించారు. మరో ఇద్దరు బస్సు బయట నిలబడి కాల్పులు జరుపుతూ అటువైపు ఎవరూ రావొద్దని హెచ్చరించారు.

బస్సు అరుపులు, కేకలు, హాహాకారాలు, భయానక వాతావరణంతో దద్దరిల్లింది. దాదాపు రెండుగంటల పాటు ఎడతెగని ఉత్కంఠ. అంతలోనే ఎయిర్‌పోర్టు భద్రతా బలగాలు బస్సును చుట్టుముట్టాయి. ముసుగులు ధరించిన దుండగులు ఉగ్రవాదులని తేలిపోయింది. పక్కావ్యూహంతో భద్రతా సిబ్బంది ప్రాణాలకు తెగించి బస్సులోకి ప్రవేశించారు.

ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ

ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ


మరికొందరు బస్సు చుట్టు పహారా కాశారు. ఉగ్రవాదమూకల్లో ఇద్దరిని భద్రతాసిబ్బంది మట్టుపెట్టారు. మరో ఇద్దరిని ప్రాణాలతో పట్టుకున్నారు. బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఇదంతా నిజమే అనుకుంటే పొరపాటే.

ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ

ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ


శంషాబాద్ ఎయిర్‌పోర్టు భద్రతా ఏర్పాట్లను పరీక్షించడానికి భద్రతాసిబ్బంది శుక్రవారం నిర్వహించిన మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఇటీవల పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి నేపథ్యంలో సీఐఎఫ్‌ఎఫ్, ఆక్టోపస్, స్థానిక పోలీసు, తెలంగాణ స్పెషల్ పోలీసు, మెరైన్, బాంబు, డాగ్‌స్కాడ్స్, జీఎంఆర్ రక్ష సెక్యూరిటీ తదితర భద్రతావర్గాలు సంయుక్తంగా నిర్వహించిన మాక్‌డ్రిల్ విజయవంతంగా ముగిసింది.

 ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ

ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ


దేశంలోని కీలక ప్రాంతాలతోపాటు నిషేధిత ప్రాంతాల్లో చోటుచేసుకొంటున్న ఉగ్రవాదదాడుల నేపథ్యంలో.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై నిజంగా ఉగ్రవాద దాడులు జరిగితే.. ఆ అనూహ్య పరిణామాలను ఎలా తిప్పికొట్టాలి? అనే అంశంతో.. అనుకోని సంఘటనలు ఎదురైతే సాధారణ జనంలో ఆత్మస్థెర్యం కల్పించే లక్ష్యంగా మాక్‌డ్రిల్ నిర్వహించారు.

 ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ

ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ


ఒకవేళ నిజంగా ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. హైదరాబాద్ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు భద్రతాదళాలు చేరుకోనే క్రమంలో వారు ఎలా స్పందిస్తారు? ఎంత సమయంలో ఘటనాస్థలానికి చేరుకొంటారు? తదితర అంశాలను భద్రతానిపుణులు, ఉన్నతాధికారులు బేరీజు వేశారు.

ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ

ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ


సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించి అవగాహన కల్పించారు. బాంబ్‌లను నిర్వీర్యం చేసే అత్యాధునిక బాంబ్ డిటెక్టర్ రోబో పనితీరు, భద్రతా దళాల మెరుపుదాడులు ప్రయాణికుల్లో ఉత్కంఠను రేపాయి.
ఎట్టేకలకు దుండగుల్ని అదుపులోకి తీసుకున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ

ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ


దీంతో గంటన్నరసేపు సాగిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని అధికారులు ప్రకటించడంతో ప్రయాణికులు, సందర్శకులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఉత్కంఠ పోరు రేపిన ఈ ఆపరేషన్ సందర్శకులు ఆశ్చర్యపోయారు.

 ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ

ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ


ఈ కార్యక్రమంలో ఎయిర్‌పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ భరత్‌కుమార్ కాందార్, మాజీ డీజీపీ హెచ్‌జే దొర, సైబరాబాద్ జాయింట్ సీపీ శివధర్‌రెడ్డి, డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ అనురాధ, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఆర్జీఐఏ) సీఐలు సుధాకర్, భాస్కర్‌రెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ భిక్షంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ

ఎయిర్‌పోర్ట్‌లో మాక్‌డ్రిల్ ఉత్కంఠ


ఉగ్రదాడుల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుపై దాడి జరిగితే ఎలా తిప్పికొట్టాలనే దానిపై భద్రతా సమీక్ష, పర్యవేక్షణ, పరిశీలన, శిక్షణ కోసమే మాక్‌డ్రిల్ నిర్వహించినట్లు శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఎయిర్‌పోర్టు, ప్రయాణికుల భద్రతపై అన్ని విధాల, అన్నివేళలా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

English summary
It was business as usual at the RGI Airport in Shamshabad until four masked men carrying assault rifles, glock pistols and rucksacks full of ammunition stormed out to hijack a bus and take its passengers hostage. After a fierce gun battle that lasted over an hour-and-a-half, two of them were shot dead and the other two captured alive in a joint operation led by CISF jawans and Octopus commandos of Telangana Police and the special party of Cyberabad police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X