బీజేపీ నగర ఉపాధ్యక్షుడిపై స్క్రూ డ్రైవర్ తో 20 సార్లు పొడిచి పరారైన వ్యక్తి .. కేసు నమోదు

భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగర ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్‌పై హత్యాయత్నం జరిగింది.హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో అభిమన్యు అనే వ్యక్తి స్క్రూడ్రైవర్‌తో అరుణ్‌పై దాడి చేశాడు. ఊహించని పరిణామంగా జరిగిన దాడిలో అరుణ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు.

అరుణ్ కుమార్‌పై ఆదివారం రాత్రి ఈ దాడి జరిగింది. సుమారు 20 సార్లు అభిమన్యు అనే వ్యక్తి అరుణ్ కుమార్ తలపై విచక్షణారహితంగా పొడిచాడు. ఫిలింనగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన అరుణ్‌ను వెంటనే సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన అభిమన్యు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

City BJP leader Arun Kumar injured in a screw driver attack .. case filed

దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరుణ్ కు అభిమన్యు కు మధ్య గల సంబంధంపై ఆరా తీస్తున్నారు. అభిమన్యు ఎవరు? ఇద్దరి మధ్య ఏవైనా పాతకక్షలు ఉన్నాయా? లేదంటే ఎవరైనా అభిమన్యుతో ఈ పనిచేయించి ఉంటారా? అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు సాగుతుంది . పరారీలో ఉన్న అభిమన్యు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అభిమన్యు దొరికితే గానీ, లేదా అరుణ్ చెప్తే గానీ అసలు విషయం బయటకు రాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+