హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

cji nv ramana: జగన్ అలా, కేసీఆర్ ఇలా -గవర్నర్, సీఎం అపూర్వ స్వాగతం -3రోజులు హైదరాబాద్ లోనే

|
Google Oneindia TeluguNews

కొవిడ్ ప్రోటోకాల్స్ కారణంగా దేశంలో దాదాపు అన్ని వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతుండగా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) ఎన్వీ రమణ హైదరాబాద్ రాక మాత్రం ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత సందడిని తెచ్చిపెట్టింది. సీజేఐ పదవి చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రంలో అడుగుపెట్టిన ఆయనకు తెలంగాణ ప్రభుత్వం అపూర్వరీతిలో ఘనస్వాగతం పలికింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రాజ్ భవన్ దాకా సందడి దృశ్యాలు కనిపించాయి. రాబోయే మూడు రోజులూ సీజేఐ హైదరాబాద్ లోనే ఉండనుండటం మరింత ఆసక్తికరంగా మారింది. వివరాలివి..

Recommended Video

Justice N V Ramana To Be Next CJI, Gets Presidential Assent For His Appointment

CJI NV Ramana మరో సంచలనం? -హైకోర్టు జడ్జిలుగా సుప్రీం లాయర్లకు ఎలివేషన్! -ఒకే చెప్పారన్న బార్CJI NV Ramana మరో సంచలనం? -హైకోర్టు జడ్జిలుగా సుప్రీం లాయర్లకు ఎలివేషన్! -ఒకే చెప్పారన్న బార్

సీజేఐకి గౌరవ వందనం..

సీజేఐకి గౌరవ వందనం..

కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లిన సీజేఐ రమణ.. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఈ సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో ఆయనకు రాష్ట్ర గవర్నర్‌ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీజేఐ రాక సందర్బంగా రాజ్ భవన్ లో స్వాగత తోరణాలు, వసతి ఏర్పాట్లు ఘనంగా చేశారు. అంతకుముందు..

CoWIN Data Breach: వ్యాక్సిన్లపై మరో దుమారం -అమ్మకానికి డేటా -ఖండించిన కేంద్రం -దర్యాప్తునకు ఆదేశంCoWIN Data Breach: వ్యాక్సిన్లపై మరో దుమారం -అమ్మకానికి డేటా -ఖండించిన కేంద్రం -దర్యాప్తునకు ఆదేశం

ఎయిర్ పోర్టులోనూ సందడి

ఎయిర్ పోర్టులోనూ సందడి

తిరుపతి నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్యేలు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వేళ్లారు. అక్కడ గవర్నర్, సీఎంలు స్వాగతం పలికారు.

తెలంగాణకు రమణ గెశ్చర్

తెలంగాణకు రమణ గెశ్చర్

సీజేఐగా తొలిసారి తెలంగాణకు రావడానికి కొద్ది గంటల ముందే, సీజేఐ రమణ చొరవతో తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య 42కు పెరగడం తెలిసిందే. ఆ చర్యకు తెలంగాణకు రమణ గెశ్చర్ గా కొందరు అభివర్ణిస్తున్నారు. టీఆర్ఎస్ కీలక నేత బోయినపల్లి వినోద్ కుమార్ సీజేఐకి ధన్యవాదాలు తెలుపుతూ సుదీర్ఘ లేఖ కూడా రాశారు. సీజేఐ హోదాలో మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చిన రమణ మూడు రోజులపాటు రాజ్‌భవన్‌ అతిథిగృహంలోనే బస చేయనున్నారు. ఆయన పాల్గొనబోయే కార్యక్రమ వివరాలు వెల్లడికావాల్సి ఉంది. జన్మత: కృష్ణాజిల్లాకు చెందినవారైన జస్టిస్ రమణ సీజేఐ హొదాలో తొలిసారి గురువారంనాడు ఏపీలో అడుగుపెట్టినా ప్రోటోకాల్ ప్రకారం సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలికేందుకు వెళ్లలేకపోయారు. ఆ సమయంలో జగన్ ఢిల్లీ పర్యటనలో ఉండటంతో మంత్రులు, అధికార యంత్రాంగమే సీజేఐకు మర్యాదలు చేశారు. గతంలో జస్టిస్ రమణపై సీఎం జగన్ ఫిర్యాదు నేపథ్యంలో ఇప్పుడాయన ఏపీ పర్యటన వేళ సీఎం ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశమైంది.

English summary
chief justice of india (CJI) NV Ramana receives grand welcome at hyderabad on his maiden visit after taking over charge as top judge. telangana governor tamilisai soundararajan, chief minister kcr and several ministers, officials welcomes cji. justice ramana will stay in hyderabad for three days. earlier cji visits tirumala temple but ap cm jagan was absent due to delhi tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X