స్కూల్ టెర్రాస్‌పై సన్నిహితంగా విద్యార్ధులు: వీడియో తీసిన టీచర్, కేసు నమోదు
హైదరాబాద్: సొంత లాభం కోసం విద్యార్ధుల జీవితాన్ని ఫణంగా పెట్టేందుకు కార్పోరేట్ స్కూళ్లు ఎంత మాత్రం ఆలోచించడం లేదు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి పోలీసు ఇన్స్‌పెక్టర్ భిక్షపతి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు స్కూల్ టెర్రాస్‌పై సన్నిహితంగా ఉండటాన్ని పక్కనే ఉన్న మరో స్కూల్ మహిళా టీచర్ చూశారు. ఆమె చూసిన ఈ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీశారు. ఆ తర్వాత దానిని ప్రిన్సిపాల్‌కు చూపించింది.
దీంతో తమకు పోటీగా ఉన్న పక్క స్కూల్‌కు చెడ్డపేరు తేవాలన్న ఆలోచనతో ప్రన్సిపాల్ ఈ వీడియోను వాట్సప్‌లో తన మిత్రులు, సన్నిహితులకు షేర్ చేశాడు. ఇంకేముంది ఈ వీడియో వాట్సప్‌లో హల్ చల్ చేసి.. చివరకు ఆ ఏరియాకు చెందిన మీడియా రిపోర్టర్లకు చేరింది.

దీంతో మీ స్కూలుకు చెందిన విద్యార్ధుల బాగోతాన్ని బయటకు రాకుండా కప్పిపుచ్చడానికి తమకు డబ్బు ఇవ్వాలని వీడియోని పాఠశాల యాజమాన్యానికి చూపించి వారిని బెదిరించారు. ఈ విషయం చివరకు బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికను ముద్దు పెట్టుకున్న బాలుడుతో పాటు వీడియో తీసిన టీచర్, దానిని వాట్సప్‌లో షేర్ చేసిన ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు పాఠశాల యాజమ్యాన్ని బెదరించిన మీడియా రిపోర్టర్లపైనా దర్యాప్తు చేపట్టారు.
ఈ సంఘటనను బట్టి చూస్తుంటే కార్పోరేట్ స్కూళ్లు నైతిక విలువలకు ఏనాడో తిలోదకాలిచ్చాయని తెలుస్తోంది. కాసుల కోసం కక్కుర్తి పడి విలువలకు పాతరేస్తున్నారు.












Click it and Unblock the Notifications