వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరి వరదల వెనుక క్లౌడ్ బరస్ట్.. విదేశీ కుట్ర కోణం: సీఎం కేసీఆర్ సంచలనం

|
Google Oneindia TeluguNews

ఆదివారం వరదలతో అతలాకుతలమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలోని ఉత్తరాది ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వెనుక దుర్మార్గపు కుట్ర కోణం ఉందని ఆరోపించారు. ఒకరకమైన 'విదేశీ కుట్ర'ను పరోక్షంగా పేర్కొంటూ గోదావరి నది వెంబడి మేఘాల విధ్వంసం సంభవించిందని ఆరోపించారు. మునుపెన్నడూ లేని విధంగా గోదావరి నదికి వరదలు రావడంపై ఈ వరదల వెనుక విదేశీ కుట్రలు దాగి ఉన్నాయి అంటూ సంచలన ఆరోపణలు చేశారు సీఎం కేసీఆర్.

Recommended Video

క్లౌడ్ బరస్ట్ కారణంగానే గోదావరి వరదలు...సీఎం కేసీఆర్ *Telangana || Telugu OneIndia

క్లౌడ్ బరస్ట్ కారణంగానే వరదలు.. దీని వెనుక విదేశీ కుట్ర

కడెం ప్రాజెక్టు వద్ద గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని వరదలు చూశామని, క్లౌడ్ బరస్ట్ కారణంగానే ఇలా అకస్మాత్ వరదలు వస్తాయని కెసిఆర్ పేర్కొన్నారు. ఇతర దేశాల వాళ్లు మన దేశం మీద ఇటువంటి కుట్రలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. క్లౌడ్‌ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చింది. దాని చుట్టూ కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు. అది ఎంత వరకు నిజమో మనకు తెలియదు. కొన్ని విదేశీ శక్తులు ఉద్దేశపూర్వకంగానే గోదావరి పరివాహక ప్రాంతంలో మేఘావృతాలు చేస్తున్నాయి అంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలోనూ విదేశీ కుట్రలతో దేశంలో క్లౌడ్ బరస్ట్ లు

ఇంతకుముందు, విదేశీ కుట్రదారులు లేహ్ (లడఖ్) లో క్లౌడ్ బరస్ట్ చేసారు. తర్వాత ఉత్తరాఖండ్‌లోనూ మేఘాల విధ్వంసం సృష్టించారు. గోదావరి బేసిన్‌లో కూడా చేస్తున్నారనే సమాచారం మాకు అందింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఏదైతేనేం ఇలాంటి అనర్థాలు సంభవిస్తున్నాయి. కాబట్టి, మన ప్రజలను మనం కాపాడుకోవాలి అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

భారీ వర్షాలు జులై 29వరకు కొనసాగే ఛాన్స్.. అలెర్ట్ గా ఉండాలన్న సీఎం

ప్రస్తుత పరిస్థితి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావాలను ప్రతిబింబిస్తుంది. వాతావరణ శాఖ మరియు కొన్ని ప్రైవేట్ అంచనాల ప్రకారం, ఈ భారీ వర్షాల పరిస్థితి జూలై 29 వరకు కొనసాగవచ్చు. వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించిన అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ ప్రమాదం ఇంకా ముగిసిపోలేదన్నారు. గోదావరి నదికి వరద ముప్పు ఇంకా తొలగిపోలేదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కేసీఆర్.

గోదావరి పరీవాహక ప్రాంతాలలో కట్టల మరమ్మత్తులు చెయ్యాలన్న కేసీఆర్

గోదావరి పరీవాహక ప్రాంతాలలో కట్టల మరమ్మత్తులు చెయ్యాలన్న కేసీఆర్


నేడు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈనెల 29వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్న కేసీఆర్, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించిన వారిని తిరిగి ఇళ్లకు పంపవద్దని చెబుతున్నారు. ఇక గోదావరి పరివాహక ప్రాంతాలలో కరకట్టలకు మరమ్మత్తులు చేయాలని అధికారులకు సూచించారు. ఇక ములుగు జిల్లాలో ముంపు ప్రజలకు శాశ్వత నిర్మాణాలు కట్టిస్తామని, వరద ముంపు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

English summary
Cloud burst behind Godavari floods. CM KCR made sensational comments that there is a suspicion that the cloud burst is a part of a foreign conspiracy..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X