కెసిఆర్ 'నా కొడుకులు' వ్యాఖ్య: కలత చెందిన జానారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇష్టానుసారం పాలన చేస్తోంటే చూస్తూ ఊరుకోవాలా? తన తప్పులను కాంగ్రెస్ పార్టీపై వేసి తప్పించుకొనేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇష్టానుసారం పాలన చేస్తోంటే చూస్తూ ఊరుకోవాలా? తన తప్పులను కాంగ్రెస్ పార్టీపై వేసి తప్పించుకొనేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఉపయోగించిన బాష అభ్యంతరంగా ఉందని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. నా కొడుకులు అంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇదేం భాష అంటూ జానారెడ్డి కెసిఆర్‌పై మండిపడ్డారు.
తన అసమర్థతను కప్పిపుచ్చుకొనేందుకు కాంగ్రెస్ పార్టీపై కెసిఆర్ నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోర్టులకు వెళ్ళేవారితో కాంగ్రెస్‌కు సంబంధం లేదన్నారు. కడుపు మండినవాళ్ళే కోర్టుకు వెళ్తున్నారని చెప్పారు.

గతంలో జాగృతిలో పనిచేసినవారే కోర్టులో కేసు వేశారని చెప్పారు.అసంబద్ద నిర్ణయాలు కోర్టులో నిలబడవని చెప్పారు. రాష్ట్రాభివృద్దికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందని చెప్పారు.
సింగరేణి కారుణ్య నియామకాలపై అసెంబ్లీలో మద్దతు ఇచ్చామన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన విమర్శలపై జానారెడ్డి ఘాటుగానే విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. కెసిఆర్ మాటలన్నీ కూడ టిఆర్ఎస్‌కే వర్తిస్తాయని చెప్పారు.












Click it and Unblock the Notifications