ఎన్నికల వేళ భట్టి సెల్ఫీలతో వినూత్న ప్రచారం..!!
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వినూత్న ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. దీనిని కొనసాగించేందుకు కొత్త ప్రచార కార్యక్రమానికి రూపకల్పన చేసారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు జరిగిన మేలు వివరించేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా సెల్ఫీ కార్యక్రమం మొదలు పెట్టారు.విద్యుత్ ప్రాజెక్టుల నుంచి..కాంగ్రెస్ హాయంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ఈ ప్రచారం కొనసాగిస్తున్నారు.
సెల్ఫీ క్యాంపైన్ : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పీపుల్స్ మార్చ్ ద్వారా ప్రజలతో మమేకం అయిన భట్టి విక్రమార్క ఇప్పుడు పార్టీ కోసం మరో కార్యక్రమం ప్రారంభించారు. పీపుల్స్ మార్చ్ యాత్ర ద్వారా భట్టికి పార్టీ హైకమాండ్ వద్ద మంచి గుర్తింపు వచ్చింది. కాంగ్రెస్ నేతలు ఆ యాత్ర సమయంలో కలిసి కదిలారు. ఇప్పుడు తిరిగి పార్టీలో కొత్త ప్రచారం ద్వారా జోష్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ ఉచిత విద్యుత్ పైన చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. దీనికి కౌంటర్ గా భట్టి..నాడు 2004లో అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం గా వైఎస్సార్ ప్రమాణ స్వీకారం చేస్తూనే...ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేసారు. ఆ ఫొటోతో భట్టి సెల్ఫీ తీసీ కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి కౌంటర్ ఇచ్చారు.
ఉచిత విద్యుత్ తో మొదలు : కాంగ్రెస్ హయాంలో రైతులకు చేసిన మేలు ఏమిటో ప్రజలకు గుర్తుచేయాలని నిర్ణయించారు. దీని కోసం సెల్ఫీ క్యాంపైన్ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ హయాంలో రాజశేఖరరెడ్డి ద్వారా ప్రారంభమైన అనేక ప్రాజెక్టులను సందర్శించి అక్కడ సెల్ఫీలు దిగాలని భట్టివిక్రమార్క నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షానే నిలుస్తుందని, రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని భట్టి విక్రమార్క సెల్ఫీ కార్యక్రమం ద్వారా మరోసారి ప్రకటించారు. ఉచిత కరెంట్ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రశ్నించే విధంగా గులాబీ నేతలు చేస్తున్న ప్రచారానికి అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు భట్టి సెల్ఫీ మార్గం ఎంచుకున్నారు.

కాంగ్రెస్ హయాం గుర్తు చేస్తూ : బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, హెచ్సీయూ, డీబీఎల్ వంటి సంస్థలతో పాటుగా రాష్ట్రంలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద కూడా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని భట్టి పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. ఉచిత విద్యుత్ విధానంలో సెల్ఫీ క్యాంపైన్ ద్వారా మొదలు పెట్టిన ప్రచారానికి మంచి రెస్పాన్స్ కనిపించింది.
కాంగ్రెస్ హయాంలో వచ్చిన మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కూడా సెల్ఫీలు దిగి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి ధీటుగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు భట్టి విక్రమార్క సూచించారు. ఇప్పుడు ఈ తరహా ప్రచారంలో కాంగ్రెస్ నేతలు నిమగ్నయ్యారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications