డీఎస్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రుల సంతాపం!!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి.శ్రీనివాస్ మృతికి ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి.శ్రీనివాస్ మంత్రిగా, ఎంపిగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు.

డీఎస్ మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
డీఎస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసే వారని....తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని చంద్రబాబు అన్నారు. డి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంతాపం తెలియజేశారు. మాజీ మంత్రి డి.శ్రీనివాస్ మరణం బాధాకరం అని ఆయన పేర్కొన్నారు.

CM Chandrababu Deputy CM Pawan Kalyan and Ministers condolences on the death of D Srinivas

డీఎస్ ను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న డి. శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, ఉన్నత విద్య శాఖల మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బలంగా తన వాదం వినిపించారన్నారు. వారిని రెండు మూడు సందర్భాల్లో కలిశానని, నా రాజకీయ ప్రయాణం, అభివృద్ధి గురించి అడిగి.. జనసేన పార్టీ ఎదుగుదలను ఆకాంక్షించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

డీఎస్ మృతి పట్ల మంత్రి కొలను పార్ధసారధి
వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. శ్రీనివాస్ కుమారుడు, లోక్ సభ సభ్యులు ధర్మపురి అరవింద్, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కొలుసు పార్థసారథి కూడా సంతాపం తెలిపారు.

డీఎస్ రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించే వారు
డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి పార్థసారథి,ఆయన మరణవార్త బాధాకరం అన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజా సేవకు అంకితమైన నాయకుడు డి. శ్రీనివాస్ అన్నారు. తనకు డి.శ్రీనివాస్‌తో మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. డి.శ్రీనివాస్ ఎప్పుడూ హుందాగా వ్యవహరించేవారని, తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేవారన్నారు.

డీఎస్ మరణం తీరని లోటు అన్న కొలను పార్ధసారధి
అందరితో సమన్వయంతో పని చేస్తూనే.. పనిచేసే నాయకులకు ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్, ఉన్నతవిద్య, అర్బన్, ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా విశేష సేవలు అందించిన వ్యక్తి డి. శ్రీనివాస్ అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రియాశీలకంగా వ్యవహరించి తనదైన ముద్ర వేసిన డి. శ్రీనివాస్ మరణం తీరని లోటు అని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+