పీవీ సింధు ‘కర్ణాటక కూతురు’: ఇది ఓ సీఎం మాట!
హైదరాబాద్: ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న పీవీ సింధు స్థానికతపై ఇప్పటికే చాలా పెద్ద చర్చలు జరుగుతున్నాయి. కొందరు తెలంగాణ బిడ్డ అంటుండగా, మరికొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమ్మాయి అంటూ చర్చను పెద్దది చేస్తున్నారు.
అదంతా కాదు.. పీవీ సింధు తెలుగమ్మాయి అని కొందరు వివాదానికి తెర దించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కోచ్ పుల్లెల గోపీచంద్ సమాధానమిస్తూ.. పీవీ సింధు భారతీయురాలని చెప్పి అందరి నుంచి ప్రశంసలందుకున్నారు.
కాగా, ఇప్పుడు మరోసారి అదే అంశం తెరపైకి వచ్చింది. ఎందుకంటే హర్యానా సీఎం మనోహర్ లాల్.. పీవీ సింధు కర్ణాటక కూతురు అంటూ అందరి దృష్టిని అటువైపు తిప్పుకున్నారు. పీవీ సింధు పేరును కూడా సరిగా పలకకపోవడం గమనార్హం. అయితే, ఆయనకు ఈ విషయంపై అవగాహన లేని కారణంగానే ఈ పొరపాటు జరిగిందని తెలుస్తోంది.
భారత్‌కు ఒలింపిక్స్‌లో తొలి పతకం అందించిన రెజ్లర్ సాక్షి మాలిక్‌ను ఘనంగా సన్మానించిన సందర్భంలో హర్యానా సీఎం ఈ పొరపాటు చేశారు. కాగా, సాక్షి మాలిక్‌కు హర్యానా ప్రభుత్వం నుంచి రూ. 2.5 కోట్లు అందించారు. అంతేగాక, 'బేటీ బచావో - బేటీ పడావో' పథకానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రచారకర్తగా సాక్షి మాలిక్‌ను నియమించారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications