అభ్యర్దులకు సీఎం కేసీఆర్ క్లాస్, పిచ్చి వేషాలు వద్దు - విజయం మనదే..!!
పార్టీ అభ్యర్దులకు ముఖ్యమంత్రి ఎన్నికల వేళ హెచ్చరికలు చేసారు. జాగ్రత్తగా నడుచుకోవాలని సూచిస్తూ..కీలక అంశాలను ప్రస్తావించారు. మళ్లీ విజయం మనదేనని, ఎవరూ తొందరపడొద్దన్నారు. ముందుగా పార్టీలో అసంతృప్తిగా ఉన్నవారిని బుజ్జగించాలని సూచించారు. చిన్న కార్తకర్త అయినా అలిగితే వారి ఇంటికెళ్లి మాట్లాడాలని కోరారు. అహంకారానికిపోతే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. పార్టీ అభ్యర్దులకు బీ ఫాంలు అందించారు.
అభ్యర్దుల మార్పుపై : పార్టీ ఖరారు చేసిన అభ్యర్దులతో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కొన్ని చోట్ల అభ్యర్దుల విషయంలో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని, వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదు. కానీ న్యాయపరమైన అంశాల వల్ల మార్చాల్సి వచ్చిందన్నారు. మార్పులు, చేర్పులు అన్నీ సానుకూలంగా జరిగాయని కేసీఆర్ అన్నారు.

ఎన్నికల వేళ కొన్ని కోపతాపాలు ఉంటాయి.. సహజమేనని, ఎన్నికల వేళ అభ్యర్థులకు ఓపిక, సంయమనం ఉండాలని హెచ్చరించారు. అందరూ నాయకులను కలుపుకుని పోవాలన్నారు. గత ఎన్నికల సందర్భంగా వ్యక్తిత్వం మార్చుకోవాలని ఒకరిద్దరికి చెప్పాను. మాట్లాడలేదు. ఒకరు ఓడిపోయారన్నారు.
సమన్వయంతో పని చేయాలి : సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాటు చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. వేములవాడలో న్యాయమైన ఇబ్బందులతోనే అభ్యర్థిని మార్చినట్టు చెప్పారు. మరోవైపు ప్రజల్లో గెలిచినా సాంకేతిక అంశాలతో దెబ్బతీయాలని కుట్రచేస్తారని బీ-ఫామ్స్ నింపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ప్రతి విషయంపై క్లారిటీతో ఉండాలని సూచించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, వనమా శ్రీనివాస్ రావు కోర్టుల్లో ఎదుర్కొంటున్న పరిస్థితులే ఇందుకు ఉదాహరణ అని సూచించారు. దరఖాస్తు నింపే సమయంలో అడ్వకేట్ల సహాయం తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ ఫోన్ నంబర్‌ను ఇచ్చారు. ఇక ఆదివారానికి 51 బీ-ఫామ్స్ మాత్రమే సిద్ధమయ్యాయని, మిగతావి రెడీ అవుతాయని తెలిపారు.

చిల్లర పనులు వద్దు : జూపల్లి కృష్ణారావు అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. ఆయన అహంకారంతో ఇతర నాయకులతో మాట్లాడలేదని, ఫలితంగా ఓడిపోయారని వివరించారు. ఒక మనిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాయకుడికి కొన్ని లక్షణాలు ఉండాలన్నారు. నాయకుల చిలిపి పనులు, చిల్లర పనుల వల్ల ఎన్నో కోల్పోతారని హెచ్చరించారు. సంస్కారవంతంగా ఉండాలి.
మంచిగా మాట్లాడం, ప్రవర్తించడం నేర్చుకోవాలని సీఎం సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మనవి చేస్తున్నా.. ఇది చాలా ముఖ్యమైన ఘట్టంగా పేర్కొన్నారు. మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. కార్యకర్తలకు మనల్ని అడిగే అధికారం ఉంటుందని అప్రమత్తం చేసారు. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలని కేసీఆర్ సూచించారు.












Click it and Unblock the Notifications