దివ్యాంగులకు కేసీఆర్ శుభవార్త- సింగరేణి కార్మికులకు అద్దిరిపోయే దసరా గిఫ్ట్

మంచిర్యాల్: తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి.. ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెడుతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.

ఇందులో భాగంగా- ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవ్వాళ మంచిర్యాల్‌లో పర్యటించారు. కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. మంచిర్యాల జిల్లా కావాలనే ప్రజల చిరకాల కోరికను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చామని గుర్తు చేశారు.

CM KCR announced the increases monthly pension provided to differently abled

పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశానికి తలమానికంగా నిలిపామని, విద్యుచ్ఛక్తి వినియోగం, గ్రామ పంచాయతీలు, తలసరి ఆదాయం, మంచినీటి సరఫరా.. వంటి పథకాలను ప్రజలకు అందించే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేసీఆర్ పునరుద్ఘాటించారు. రైతులకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తోన్నామని, ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. రైతుబంధు కింద 60,000 కోట్లను ఖర్చు చేశామని పేర్కొన్నారు.

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి టర్నోవర్‌ను 33,000 కోట్లకు పెంచుకోగలిగామని కేసీఆర్ అన్నారు. గతంలో సింగరేణికి వచ్చే లాభాలు రూ.400 కోట్ల వరకు పరిమితం అయ్యేదని, కార్మికులకు బోనస్ చాలా తక్కువగా లభించేదని గుర్తు చేశారు. 2,184 కోట్ల రూపాయలను ఈ ఏడాదే లాభాలుగా ఆర్జించామని కేసీఆర్ అన్నారు. వచ్చే దసరాకు 700 కోట్ల రూపాయల బోనస్‌ను సింగరేణి కార్మికులకు పంచబోతోన్నామని ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్‌పరం చేయాలని ప్రయత్నిస్తోందని, దీన్ని అడ్డుకుని తీరుతామని కేసీఆర్ అన్నారు. ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ ద్వారా 300 బిలియన్ టన్నుల బొగ్గు అందుబాటులో ఉంటోందని, అలాంటి సంస్థలను కేంద్రం ప్రైవేట్ పరం చేసే కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే- బీజేపీ నిండా ముంచబోతోందని ధ్వజమెత్తారు.

ఖమ్మం జిల్లాలో ఖనిజ నిల్వలు అపారంగా ఉన్నాయని, వాటితో పాటు ఇతర గనుల తవ్వకాల్లోనూ సింగరేణి సేవలను వినియోగిస్తామని కేసీఆర్ చెప్పారు. మొత్తం దేశానికే విద్యుత్‌ను సరఫరా చేసేంతటి బొగ్గు నిల్వలు ఉన్నాయని, అయినా ఆస్ట్రేలియా, ఇండనేషియా నుంచి దిగుమతి చేసుకుంటూ దేశ ప్రజల మీద మోయలేని భారాన్నికేంద్రం మోపుతోందంటూ కేసీఆర్ ఆరోపించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. ప్రతినెలా వారికి 3,116 రూపాయల మొత్తాన్ని పింఛన్‌గా అందజేస్తోన్నామని, దీన్ని మరో 1,000 రూపాయలకు పెంచుతున్నానని అన్నారు. ఇకపై ప్రతి నెలా 4,116 రూపాయల పింఛన్ ఇస్తానని ప్రకటించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ మాట చెప్పాలని దీన్ని సస్పెన్స్‌లో ఉంచానని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+