పెన్షన్ రూ 5 వేలు, మహిళలకు రూ 3వేలు - రూ 400కే గ్యాస్ , కేసీఆర్ ప్రకటన..!!

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలు ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి విడుదల చేసారు. కాంగ్రెస్ గ్యారంటీ పథకాలకు ధీటుగా మేనిఫెస్టోను తీర్చి దిద్దారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రాష్ట్రంలో రూ 5లక్షల భీమా కల్పిస్తామని ప్రకటించారు. కేసీఆర్ భీమా - ప్రతీ ఇంటికి ధీమా పేరుతో ఎల్ఐసీ భీమా కల్పిస్తామి హామీ ఇచ్చారు. అదే విధంగా ఆసరా పెన్షన్ ను రూ 5వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేసారు. మరిన్ని కీలక హామీలను గుప్పించారు.

బీఆర్ఎస్ మేనిఫెస్టో : ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించారు. అన్ని వర్గాలకు ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు. రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగిలే అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రూ 5 లక్షల చొప్పున భీమా అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వమే ప్రతీ ఒక్కరి భీమా చెల్లింపు చేస్తుందని..ఎల్ఐసీ నుంచి ఈ భీమా అందేలా అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చే ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొస్తామని కేసీఆర్ వెల్లడించారు. దీని కోసం దాదాపు రూ 3 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేసారు. దీంతో పాటుగా ప్రస్తుతం అందిస్తున్న రూ 2,116 ఆసరా పెన్షన్ ను రూ 5వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇందుకోసం తమ ఆలోచనలను స్పష్టం చేసారు.

CM KCR Announces Attractive Promises for women and Farmers in BRS Manifesto for next Elections

ఆసరా పెన్షన్లు పెంపు : ఏపీలో సీఎం జగన్ అమలు చేసిన విధంగా క్రమేణా పెన్షన్ పెంపుదల అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ముందుగా ప్రస్తుతం ఉన్న రూ 2,116 నుంచి మూడు వేలకు పెంచుతామని..తరువాత అయిదేళ్ల కాలంలో రూ 5వేలు అమలు చేస్తామని చెప్పారు. అదే విధంగా వికలాంగులకు అందిస్తున్న పెన్షన్ రూ 4వేల నుంచి రూ 6 వేలకు పెంచుతామని చెప్పారు. రైతు బంధు పథకం కింద ప్రస్తుతం అందిస్తున్న రూ 10 వేలను రూ 16 వేలకు దశల వారీగా పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. తొలి ఏడాది రూ 12 వేలు ఇస్తామని..అయిదేళ్లలో రూ 16 వేలకు పెంచుతామని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద రూ 15 లక్షల వరకు చికిత్స అందిస్తామని ప్రకటించారు. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ 3వేలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

మహిళలకు నెలకు రూ 3వేలు : హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్స్ నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అన్నపూర్ణ కింద సన్న బియ్యం అందిస్తామని హామీ ఇచ్చారు మైనార్టీ జూనియర్ కాలేజీలను రెసిడెన్షియల్ కళాశాలలు గా మారుస్తామని చెప్పుకొచ్చారు. దళిత బంధు కొనసాగిస్తామని ప్రకటించారు..అర్హులైన వారికి రూ 400కే సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. ఉద్యోగులకు సీపీఎస్ రద్దు పరిశీలన పైన అధ్యయనం చేసామని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు తూతూ మంత్రంగా మారాయని చెప్పారు. దీని పైన ఆచరణాత్మకంగా అధ్యయనం చేయటానికి ఒక ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటుపైన హామీ ఇచ్చారు. గిరజనేతురులకు పోడు భూములు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఆర్భాటపు ప్రకటనలు కాకుండా..ఆచరణాత్మకంగా అమలుకు వీలుగా కసరత్తు చేసి మేనిఫెస్టో ప్రకటన చేస్తున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+