వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ‌లో కాంగ్రెస్-టీడిపి పొత్తుకు లైన్ క్లియ‌ర్ చేసిన కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

సెప్టెంబ‌ర్ 2న గులాబీ బాస్ ఏం చెప్ప‌బోతున్నారు..??

తెలంగాణ భ‌వ‌న్ లో జ‌రిగిన విస్త్రుత స్థాయి స‌మావేశం రాబోవు ఎన్నిక‌ల పొత్తుల ప‌ట్ల క్లారిటీ ఇచ్చింది. ఇంత‌కాలం ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని 2019లో ఎన్నిక‌ల్లో పోటీ చేయాలి అనుకునే పార్టీల‌కు స‌మాధానం దొరికింది. సోమ‌వారం తెలంగాణా భ‌వ‌న్ లో మాట్లాడిన గులాబీ బాస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రితోనూ పొత్తు ఉండ‌ద‌ని, ఒంట‌రిగానే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల‌ని భావిస్తున్న ఇత‌ర పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయం క‌నిపిస్తోంది. దీంతో ముఖ్యంగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పొత్తు కు మార్గం సుగ‌మ‌మైంది. ఇక ఇరు పార్టీల నేత‌లు కూర్చుని సీట్ల సర్దుబాటుపై లెక్క‌లుతేల్చుకుంటే స‌రిపోతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

 టీఆర్ఎస్ ఒంట‌రిగా పోటీ..! టీడిపి-కాంగ్రెస్ పొత్తు ఖ‌రార‌య్యే అవ‌కాశం..!!

టీఆర్ఎస్ ఒంట‌రిగా పోటీ..! టీడిపి-కాంగ్రెస్ పొత్తు ఖ‌రార‌య్యే అవ‌కాశం..!!

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల పొత్తుకు లైన్ క్లియర్ అయింది. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన సీఎం కెసీఆర్ తాము ఒంటరిగా బరిలో ఉంటామని తేల్చిచెప్పారు. దీంతో తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ ల పొత్తుకు మార్గం సుగమం అయినట్లు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కెసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అందరినీ తమ వైపు తిప్పుకున్నారు. టీఆర్ఎస్ వెళ్ళగా మిగిలిన లీడర్లు వివిధ పార్టీల వైపు వెళ్ళిపోయారు. అయినా కూడా తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు ఖచ్చితంగా పది నుంచి పదిహేను శాతంపైనే ఉంటుందని అంచనా వేసుకుంటోంది.

 టీడిపి ఓటు బ్యాంకు బ‌ద్రం..! కీల‌కంగా మార‌నున్న దేశం ఓట్లు..!!

టీడిపి ఓటు బ్యాంకు బ‌ద్రం..! కీల‌కంగా మార‌నున్న దేశం ఓట్లు..!!

మొద‌ట‌ టీడీపీ, టీఆర్ఎస్ పొత్తుకు కొంత మంది ప్రయత్నాలు కూడా చేశారు. కానీ అవేమీ ఫలించినట్లు లేదు. మారిన పరిస్థితుల్లో టీఆర్ఎస్, టీడీపీల పొత్తు జరిగే పనికాదని తేలిపోయింది. తాజాగా తెలంగాణ సీఎం కెసీఆర్ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీకి దగ్గర అవటం, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నిన్నటి మొన్నటివరకూ అనుకూలంగా మాట్లాడి. ఇప్పుడు అడ్డంగా మాట్ల‌డుతున్న టీఆర్ఎస్ నేత‌ల ప‌ట్ల టీడీపీ శ్రేణులు కూడా అసంతృప్తితో ఉన్నాయి.ఈ నేప‌థ్యంలో పెత్తుకు అంత సానుకూల వాతావ‌ర‌ణం ఉండ‌దనే వాద‌న కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది.

కాంగ్రెస్-టీడిపి క‌లిస్తే గులాబీకి ప్ర‌మాద‌మే..! కేసీఆర్ అస్త్రాల‌కు ప‌దును పెట్టాల్సిందే..!!

కాంగ్రెస్-టీడిపి క‌లిస్తే గులాబీకి ప్ర‌మాద‌మే..! కేసీఆర్ అస్త్రాల‌కు ప‌దును పెట్టాల్సిందే..!!

కెసీఆర్ తాజా ప్రకటన తాజా పరిణామాలు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల పొత్తుకు లైన్ క్లియర్ అయినట్లేనని రెండు పార్టీలకు అంతకు మించిన మరో ఆప్షన్ కూడా లేదని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎలాంటి వివాదాలు లేకుండా ఖరారు అయితే మాత్రం అది వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను మరింత మెరుగుపర్చటం ఖాయం అని చెబుతున్నారు.

 తెలంగాణ‌తో పాటు ఏపిలో కూడా క‌లిసి న‌డుద్దాం.. కాంగ్రెస్ తో చంద్ర‌బాబు మాస్ల‌ర్ ప్లాన్..!

తెలంగాణ‌తో పాటు ఏపిలో కూడా క‌లిసి న‌డుద్దాం.. కాంగ్రెస్ తో చంద్ర‌బాబు మాస్ల‌ర్ ప్లాన్..!

ఇక తెలంగాణతో పాటు ఏపీలోనూ కాంగ్రెస్ తో జట్టుకట్టేందుకు రెడీ అయిపోయారు ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. అయితే కెసీఆర్ తాజా వ్యాఖ్యలు ఈ పొత్తు సాద్యాసాద్య‌ల‌ను మరింత పెంచాయి. తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశఫెట్టినప్పటికీ ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యవహారశైలి వల్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. చాలా చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి ఉందని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ టీడిపి ల పొత్తు తెలంగాణ‌లో ఆశించిన ఫ‌లితాలు ఇస్తాయ‌నే భ‌రోసా అటు కాంగ్రెస్, ఇటు టీడిపి నేతల్లో వ్య‌క్తం అవుతోంది.

English summary
telangana politics turning into interested way. cm kcr announced no alliance in 2019 elections. so its line cleared for tdp congress party alliance in 2019 elections in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X