టికెట్ల ఖరారు పై కేసీఆర్ కీలక నిర్ణయం - ఛాన్స్ ఎవరికి, హిట్ లిస్ట్ రెడీ..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. హ్యాట్రిక్ సాధించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. అభ్యర్ధుల ఖరారు పైన ఫోకస్ చేసారు. తొలి జాబితా ఇప్పటికే సిద్దం అయింది. బీజేపీ అంతర్గత కుమ్ములాటలు..కాంగ్రెస్ కర్ణాటక చూసి ఆశలు మినహా.. క్షేత్ర స్థాయిలో బలోపేతం కాలేదనేది బీఆర్ఎస్ వాదన. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్ధుల జాబితా ప్రకటనకు సీఎం కేసీఆర్ సిద్దమయ్యారు.
అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు : ముచ్చటగా మూడో సారి అధికారం దక్కించుకోవాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం. ఇందుకోసం తొలి నుంచి పక్కా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. సిట్టింగ్ లకు సీట్లు గ్యారంటీ అని చెప్పటం ద్వారా పార్టీ నుంచి ఎవరూ పక్క పార్టీల వైపు వ్యూహం రచించారు. ఎమ్మెల్యేలకు క్షేత్ర స్థాయిలో ఉన్న ఆదరణ ఆధారంగా మార్కులు ఖరారు చేసారు.

ఓ ఒక్క స్థానం కూడా చేజేతులా పోగొట్టుకోకూడదని..గెలుపే ప్రామాణికం గా అభ్యర్ధుల ఎంపిక ఉండాలని నిర్ణయించారు. ఆషాడం ముగిసిన వెంటనే తొలి జాబితా ప్రకటనకు సీఎం కేసీఆర్ సమాయత్తం అవుతున్నారు. ఒకే సారి 70 మంది వరకు అభ్యర్ధుల జాబితాతో తొలి విడత ప్రకటన ఉంటుందని విశ్వససనీయ సమాచారం. దీంతో, జాబితాలో ఉండేదెవరు..హిట్ లిస్టులో ఉన్నదెవరనే ఆసక్తి మొదలైంది.
ఈ నెలలోనే ప్రకటనకు ఛాన్స్ : బీజేపీలో కొనసాగుతున్న ఇంటర్నర్ వార్ తో బీఆర్ఎస్ కు కలిసొచ్చే అంశం. అటు కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల ఫలితాల గురించి ప్రస్తావించి..ఇక్కడ గెలుస్తామని చెప్పటం మినహా.. క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి ఆదరణ లేదనేది బీఆర్ఎస్ నేతల విశ్లేషణ. ఈ సారి సీట్ల కేటాయింపులో ప్రస్తుత మంత్రులకు తిరిగి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
ముందుగానే అభ్యర్దులను ప్రకటించటం ద్వారా ఎన్నికల నాటికి మరింతగా ప్రజల్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. టికెట్ల కోసం పలు నియోజకవర్గాల్లో పోటీ ఎక్కువగా ఉండటంతో..ముందుగానే క్లారిటీ ఇవ్వటం ద్వారా చివరి నిమషంలో కీచులాటలకు అవకాశం లేకుండా.. ప్రచారం చేసుకునేందుకు వీలు చిక్కుతుందని అంచనా వేస్తున్నారు.

మార్పులు - చేర్పులు : ఇప్పటికే దాదాపు 18 మందికి బీఆర్ఎస్ టికెట్లు ఖరారు చేస్తూ సభలు..సమావేశాల్లో సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు అయిదుగురు ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశం లేదని పార్టీలో ప్రచారం సాగుతోంది. స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్య..శ్రీహరి మధ్య పోటీ ఉండటంలో శ్రీహరికి అసెంబ్టీకి..రాజయ్యకు లోక్ సభకు పంపే అవకాశం ఉందని చెబుతున్నారు.
అదే విధంగా ఎంపీ పసునూరికి ఎమ్మెల్సీ ఇస్తారని సమాచారం. మహబూబా బాద్ లో ఎంపీ సత్యవతిని బరిలోకి దింపే అవకాశం ఉంది. ఎంపీగా ఐఏఎస్ అధికారి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ కవితను డోర్నకల్ నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. ఇలా పలు సమీకరణాలతో బీఆర్ఎస్ జాబితా సిద్దం అవుతోంది. శ్రావణ మాసం ఆరంభంలోనే అధికారిక ప్రకటనకు రంగం సిద్దం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications