అభ్యర్దులకు రూ 40లక్షల చెక్కు ఇచ్చిన సీఎం కేసీఆర్..!!
ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫారాలు అందించారు. తెలంగాణ భవన్‌లో 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రెండు బీ-ఫారాలు అందిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇదే సమయంలో పార్టీ అభ్యర్దులకు ముఖ్యమంత్రి ఎన్నికల వేళ హెచ్చరికలు చేసారు. జాగ్రత్తగా నడుచుకోవాలని సూచిస్తూ..కీలక అంశాలను ప్రస్తావించారు. ఒక్కో అభ్యర్దికి రూ 40 లక్షల చెక్కును అందించారు.
అభ్యర్దులకు బీ ఫారంలు : పార్టీ అభ్యర్దులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం చేసారు. మళ్లీ విజయం మనదేనని, ఎవరూ తొందరపడొద్దన్నారు. ముందుగా పార్టీలో అసంతృప్తిగా ఉన్నవారిని బుజ్జగించాలని సూచించారు. చిన్న కార్తకర్త అయినా అలిగితే వారి ఇంటికెళ్లి మాట్లాడాలని కోరారు. అహంకారానికిపోతే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. కొన్ని చోట్ల అభ్యర్దుల విషయంలో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని, వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదు.

కానీ న్యాయపరమైన అంశాల వల్ల మార్చాల్సి వచ్చిందన్నారు. మార్పులు, చేర్పులు అన్నీ సానుకూలంగా జరిగాయని కేసీఆర్ అన్నారు. ఎన్నికల వేళ కొన్ని కోపతాపాలు ఉంటాయి.. సహజమేనని, ఎన్నికల వేళ అభ్యర్థులకు ఓపిక, సంయమనం ఉండాలని హెచ్చరించారు. అందరూ నాయకులను కలుపుకుని పోవాలన్నారు.
ఒక్కో అభ్యర్దికి రూ 40 లక్షల చెక్ : తెలంగాణ భవన్‌లో 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రెండు బీ-ఫారాలు అందిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. మితగా వారికి రేపు బీ-ఫారాలు అందిస్తామన్నారు. కేసీఆర్ తరపున గంప గోవర్ధన్, మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున ఎమ్మెల్సీ కవిత బీ-ఫారమ్ అందుకున్నారు. ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు.
బీఫామ్‌లతో పాటు ఒక్కొక్కరికీ రూ.40 లక్షల చెక్కును అందజేశారు. బీ-ఫారమ్ అందుకున్న వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, షకీల్, జాజాల సురేందర్, గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, పట్నం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి సహా మొత్తం 51 మంది ఉన్నారు.

ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఆసరా పెన్షన్లకు దశల వారీగా రూ 5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అర్హులైన మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని చెప్పారు. ఆరోగ్య శ్రీ పరిధిని రూ.15లక్షలకు పెంచుతామని ప్రకటించారు. సౌభాగ్యలక్ష్మీ పథకం కింద బీపీఎల్ కింద ఉన్న పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.
దివ్యాంగుల పెన్షన్లు రూ.6వేలకు పెంపు పైన సీఎం మేనిఫెస్టోలో స్పష్టత ఇచ్చారు. రైతుబంధు 16 వేలకు పెంచుతామని ప్రకటించారు. మొదటి సంవత్సరం రూ.12వేలకు పెంచుతాం. తర్వాత ప్రతి ఏడాది విడతలవారీగా రూ.16వేలకు పెంచుతామని కేసీఆర్ వివరించారు. ఆసరా పెన్షన్లను ప్రస్తుతం ఇస్తున్న రూ 2,016 నుంచి మార్చి తర్వాత పెన్షన్‌ను రూ.3వేలు చేస్తాం. ప్రతి సంవత్సరం 500 పెంచుతూ ఐదో సంవత్సరం నిండేనాటికి రూ.5వేలకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి హామీ ఇఛ్చారు.












Click it and Unblock the Notifications