KCR: అంబులెన్స్ లు, అమ్మఒడి వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో 108 అంబులెన్స్ లు, అమ్మఒడి వాహనాలను ప్రారంభించారు. 204 అంబులెన్స్ లు, 228 అమ్మఒడి వాహనాలు, 228 పరమపద వాహనాలను సీఎం కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణలో భారీగా అంబులెన్స్ ల సంఖ్య పెంచినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 2014లో తెలంగాణలో 321 108 వాహనాలు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 455కు పెరిగిందన్నారు.
వైద్య సేవల్లో తెలంగాణ దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అప్పట్లో లక్ష జనాభాకు ఒక్క 108 వాహనం ఉంటే.. ఇప్పుడు 75 వేల మందికి ఒక 108 వాహనం ఉందని చెప్పారు. 108 ఉద్యోగులకు 4 స్లాబులుగా వేతనాలు పెంచుతామని హరీష్ రావు పేర్కొన్నారు.

అంబులెన్స్ ల ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయంతో నుంచి మహారాష్ట్రకు బయల్దేరారు. కేసీఆర్ మాహారాష్ట్రలోని పటేగావ్ జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ పేరు పొందిన సామాజిక కార్యకర్త, రచయిత అయిన అన్న బావు సాఠే వర్ధంతి కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొననున్నారు. అన్న బావు సాఠే అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించి ఎంతో పేరు తెచ్చుకున్నారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు అన్న బావు సాఠే ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులతో కేసీఆర్ సమావేశమవుతారు. సాయంత్రం ఐదు గంటలకు కొల్లాపూర్ విమానాశ్రయం కి చేరుకుని ప్రత్యేక విమానంలో మళ్లీ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి తిరిగి రానున్నారు.












Click it and Unblock the Notifications