Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

KCR: నూతన సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్.. ఆ ఒక్కటి మార్చాలంటూ సూచన..!

సీఎం కేసీఆర్ నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయాన్ని పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు.

తెలంగాణ నూతన సచివాలయాన్ని వచ్చే నెల 17న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. భవనం ఫస్ట్ ఫ్లోర్లో మెట్లకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేశారు. అలాగే ఆరో అంతస్తులోని సీఎం ఆఫీస్ ను కూడా పరిశీలించారు. సీఎం ఛాంబర్‌లో కొన్ని మార్పులను చేయాలని ఆదేశించారు.

సిగ్నల్ బూస్టింగ్

సిగ్నల్ బూస్టింగ్

కారిడార్లలో తుది దశకు చేరుకున్న మార్బుల్ పాలిషింగ్, పెయింటింగ్ పనులు, ఎలివేషన్ లో భాగంగా కళాకృతులు, చివరిదశ పనులను మరింత సృజనాత్మకంగా ఉండాలని నిర్మాణ సంస్థకు చెందిన అధికారులతో మాట్లాడారు. సచివాలయంలో నిరంతరం ఇంటర్నెట్ సౌకర్యం ఉండేందుకు ఏర్పాటు సిగ్నల్ బూస్టింగ్ వ్యవస్థ గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్

అనంతరం సీఎస్ ఛాంబర్, సీఎంఓ కార్యదర్శులు, సిబ్బంది, ప్రభుత్వ సలహాదారుల కోసం నిర్మించిన కార్యాలయాలను తనిఖీ చేశారు. సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ఉదయం 11:30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అలాగే ఈ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంగా పేరు పెట్టారు. సచివాలయంలో ప్రారంభోత్సవానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సందర్శన యాగం చేయనున్నారు.

ఎంకే స్టాలిన్

ఎంకే స్టాలిన్


సచివాలయ ప్రారంభ మహోత్సవానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలను ఆహ్వానించనున్నారు. తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రానున్నారు. అలాగే అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్, బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హాజరుకానున్నారు.

బహిరంగ సభ

బహిరంగ సభ


సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రులు, పాటు జాతీయ నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ సచివాలయాన్ని రూ.617 కోట్లతో గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో కట్టారు. భవనంలోకి గాలి, వెలుతురు వచ్చేలా ప్లాన్‌ చేశారు. సచివాలయం లోపలే టెంపుల్‌, మజీద్‌ కూడా నిర్మిస్తున్నారు.

100 ఏళ్లు

100 ఏళ్లు


భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా దాదాపు 100 ఏళ్లు మనగలిగేలా ఈ సెక్రటేరియన్ భవనాన్ని నిర్మించినట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. తెలంగాణ సెక్రటేరియట్ మొత్తం విస్తీర్ణం 28 ఎకరాలు కాగా.. ఇందులో 10,51,676 చదరపు అడుగుల్లో 11 అంతస్తుల ఎత్తులో భవనాన్ని నిర్మించారు. అయితే, ఇందులో ఉన్నవి ఆరు అంతస్తులు మాత్రమే. డెక్కన్, కాకతీయ శైలిలో నిర్మించిన ఈ భవనానికి 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలు ఉన్నాయి.

2019లో శంకుస్థాపన

2019లో శంకుస్థాపన


తెలంగాణ సంప్రదాయంతోపాటు ఆధునిక హంగులతో దీన్ని నిర్మించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి జూన్ 27, 2019లో కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వేగంగా భవన నిర్మాణ పనులు పూర్తి చేయడంతో ఫిబ్రవరి 17న కేసీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించినున్నారు. సచివాలయానికి సమీపంలో భారీ ఎత్తులో అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా నిర్మిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+