వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజురాబాద్ లో సక్సెస్ అయితేనే యావత్ తెలంగాణాలో దళిత బంధు, ఇదో ఉద్యమం : సీఎం కేసీఆర్ చెప్పిందిదే !!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కోసం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వెనుక హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రధాన కారణమని విమర్శలు వెల్లువగా మారినా సీఎం కేసీఆర్ దళిత బంధు విషయంలో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలు, కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో తొలి అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు .

ప్రగతి భవన్ లో దళిత బంధు అవగాహనా కార్యక్రమం నిర్వహించిన కేసీఆర్

ప్రగతి భవన్ లో దళిత బంధు అవగాహనా కార్యక్రమం నిర్వహించిన కేసీఆర్


హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధును పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్న నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత బంధువులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత బంధు ఒక కార్యక్రమం కాదని, ఒక ఉద్యమం అని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన దళిత బంధు అవగాహన సమావేశంలో మంత్రి హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన 412 మంది దళిత బంధువులతోపాటు, 15 మంది రిసోర్స్ పర్సన్లు, అధికారులు పాల్గొన్నారు.

Recommended Video

KCR was misleading the people of Telangana in the name of land auction -Revanth Reddy
హుజురాబాద్ విజయంపైనే యావత్ తెలంగాణా దళిత బంధు విజయం

హుజురాబాద్ విజయంపైనే యావత్ తెలంగాణా దళిత బంధు విజయం


ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హుజురాబాద్ లో దళిత బంధు సాధించే విజయం పైనే యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మంచి కార్యక్రమానికి ప్రతికూల శక్తులు అడ్డుపడుతూ ఉంటాయన్న కెసిఆర్ మనలో పరస్పర సహకారం పెరగాలని, ద్వేషాలు పోవాలని సూచించారు. గతంలో ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ పై ఒత్తిడి తెచ్చి విజయం సాధించిందని గుర్తు చేశారు కేసీఆర్. నమ్మిన ధర్మానికి కట్టుబడి ప్రయాణం సాగించినప్పుడే విజయం సాధిస్తామని పేర్కొన్న కేసీఆర్, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చేసిన కృషి తో దళిత సమాజంలో వెలుగు రేఖలు వచ్చాయన్నారు.

దళితులు పరస్పర సహకారంతో మెలగాలన్న సీఎం కేసీఆర్

దళితులు పరస్పర సహకారంతో మెలగాలన్న సీఎం కేసీఆర్


దళితులు పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవాలని, దళితవాడలలో ఒకరిపై ఒకరు పెట్టుకున్న పరస్పర కేసులను రద్దు చేసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈ పథకాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దళితులు ఒకరిపై ఒకరు పరస్పర అనుబంధం పెంపొందించుకున్నప్పుడే విజయానికి బాటలు పడతాయి అని సూచించారు కేసీఆర్. ఒక ఉద్యమంలా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు కేసీఆర్. హుజరాబాద్ లో దళిత బంధు విజయం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
The first awareness meeting was held at Pragati Bhavan under the chairmanship of Chief Minister KCR on the implementation and functioning of the Dalit Bandhu scheme in the state of Telangana. CM KCR made key remarks at the meeting. KCR said that the success of the entire Telangana Dalit Bandhu was based on the success of Huzurabad and that the Dalit Bandhu was not a scheme but a movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X