మీరీ పనులు చేస్తే నేను మహారాష్ట్రకు రాను: ఔరంగాబాద్ సభలో సీఎం కేసీఆర్
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర వెనుకబాటుతనం పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అన్ని విషయాలలోనూ వెనుకబడిందని పేర్కొన్నారు. కెసిఆర్ కు మహారాష్ట్రలో ఏం పని అని ఫడ్నవీస్ అంటున్నారని తెలంగాణ లాంటి మోడల్ మహారాష్ట్రలో తీసుకు వస్తే తాను ఎందుకు వస్తాను అంటూ ప్రశ్నించారు.
మహారాష్ట్రలో దళిత బంధు, రైతుబంధు అమలు చేస్తే, రైతు బీమా కల్పిస్తే, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తే తాను మహారాష్ట్రకు రానని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ పుట్టిన నేలపైన దళితులను పట్టించుకోరా అంటూ ప్రశ్నించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళిత బంధు లాంటి పథకాన్ని మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. అంతేకాదు నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రులు నేతలు మేకిన్ ఇండియా అంటారని కానీ నగరంలో వీధికో చైనా బజార్ ఉంటుందని కెసిఆర్ మండిపడ్డారు. డిజిటల్ ఇండియా మజాక్ అయిందని, మేకిన్ ఇండియా జోక్ అయిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో మంత్రుల కేబినెట్ ఉంటుందని, మహారాష్ట్రలో మంత్రుల క్యాబినెట్ ఉంటుందని తనిఖీ సెక్రెటరీ ఎందుకు ఉండరని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఇంటింటికి తాగునీరు అందించామో అదేవిధంగా మహారాష్ట్రలో అందించి తీరుతామన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని, ఉచిత కరెంటు ఇస్తామని, రైతులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తాగేందుకు నీరు ఉండవా అంటూ ప్రశ్నించారు. ఇక మార్పు కోసమే బి ఆర్ ఎస్ పుట్టిందని కెసిఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో తాగునీటి సమస్య లేకుండా చేశామని, తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని, భూముల రిజిస్ట్రేషన్ లు పావుగంటలోనే అవుతున్నాయని, రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తున్నామని, రైతు బంధు , రైతు బీమా లతో రైతాంగానికి మేలు చేస్తున్నామని చెప్పిన కేసీఆర్, మహారాష్ట్రలో ఇవి ఎందుకు అమలు కావడం లేదో అందరూ ఆలోచించాలన్నారు. తెలంగాణలో సాధ్యమైనపుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలో అధికారం ఇస్తే అన్నీ మౌలిక వసతులు కల్పిస్తానన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications