గులాబీ పండుగ - 7 అంశాలపై తీర్మానాలు : 6 వేల ప్రతినిదులు హాజరు..కేసీఆర్ కీలక ప్రసంగం..!!
రెండు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సమితి ప్లనరీకి అంతా సిద్దమైంది. గులాబీ పండుగ లా హైదరాబాద్ నగరం మొత్తం స్వాగత తోరణాలతో గులాబీమయమైంది. ప్లీనరీని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మాదాపూర్ హెటెక్స్‌లో జరిగే ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఆరు వేల మంది ప్రతినిధులను ఆహ్వానించారు. పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్లీనరీకి చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశారు. వేదికను ప్రత్యేకంగా అలంకరించారు. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు.

మూడేళ్ల తరువాత పార్టీ ప్లనరీ
మూడేళ్ల తర్వాత ప్లీనరీ నిర్వహిస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. హైదరాబాద్ వ్యాప్తంగా గులాబీ తోరణాలు కట్టడంతోపాటు కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పాస్‌ల కోసం ముఖ్య కార్యకర్తలు పోటీపడడంతో ఎవరికి ఇవ్వాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల కోసం 9 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ సహా 33 రకాల వంటకాలతో మెనూ సిద్ధం చేశారు. టీఆర్‌ఎస్ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం.. ఏడేళ్ల ప్రభుత్వ ప్రస్థానం ప్రధాన అజెండాగా ప్లీనరీలో చర్చలు..ప్రసంగాలు సాగనున్నాయి.

ఏడు తీర్మానాలకు ఆమోదం..
ఈ ప్లీనరీలో ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ప్లీనరీ వేదికపై టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసీనులు కానున్నారు. వీరందరికీ సౌకర్యంగా ఉండేలా సభా వేదికను విశాలంగా సిద్ధం చేశారు. వేదికపై అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటుచేశారు. కాకతీయ కళా తోరణం, హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి, ద్విదశాబ్ది ఉత్సవాల లోగో, తెలంగాణ తల్లి, సీఎం కేసీఆర్ బొమ్మలతో అలంకరించారు.

ఆరు వేల ప్రతినిధులకు ఏర్పాట్లు
వేదికపై సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఎగరవేస్తారు. ప్లీనరీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ హైటెక్స్ ప్రాంగణంలో భారీ కాకతీయ కళాతోరణం, దాని ముందు కాళేశ్వరం ప్రాజెక్టు మోడల్‌ను ఏర్పాటుచేశారు. ప్లీనరీలో ప్రతినిధుల నమోదుకు ప్రతి జిల్లాకు ఒక కౌంటర్ చొప్పున 33 కౌంటర్లను ఏర్పాటుచేశారు. ప్రతినిధులకు ప్రత్యేకంగా కిట్‌ను అందించనున్నారు. ప్లీనరీకి 25 దేశాల నుంచి పార్టీ ఎన్నారై శాఖల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. ప్రతినిధులు ప్లీనరీకి చేరుకోవడానికి హైటెక్ ఏర్పాట్లుచేశారు.
Recommended Video

కేసీఆర్ కీలక ప్రసంగం....దిశా నిర్దేశం
ఎవరు ఎక్కడి నుంచి రావాలి.. ఎక్కడ వాహనాలను పార్క్ చేయాలనే దానిపై గందరగోళం లేకుండా రూట్ మ్యాప్ గూగుల్ లొకేషన్‌ను షేర్ చేశారు. ప్లీనరీ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పరిశీలించారు. 20 ఏండ్ల టీఆర్‌ఎస్ పార్టీ ప్రస్థానంలో గర్వించదగ్గ క్షణాలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు. ప్లీనరీలో ప్రతినిధులకు పసందైన భోజనం వడ్డించనున్నారు. ఇందుకోసం 33 రకాల వంటకాలను సిద్ధం చేశారు. వీటిలో శాఖాహారం, మాంసాహారం వంటలున్నాయి. తెలంగాణ ప్రత్యేకతలను తెలిపే వంటకాలు, స్వీట్లు సిద్ధం చేశారు. 15 వేల మందికి సరిపడేలా భోజన ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications