Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సమైక్య పాలనలో నిర్లక్ష్యం, కబ్జాదారులపై చర్యలు: సిఎం కెసిఆర్, ‘నెగిటివ్ వార్తలు రాయొద్దు’

హైదరాబాద్: నగరంలోని అనేక నాలాలు కబ్జాకు గురయ్యాయని, దీంతో నగరంలో చిన్న వర్షం వచ్చిన రోడ్లన్నీ జలమవుతున్నాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ నిర్లక్ష్యానికి గురైందని అన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా చెత్త సేకరణకు ఆటో ట్రాలీలను ముఖ్యమంత్రి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. చెత్త బుట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. ఆటోలు వచ్చినా చెత్త మిగిలే ఉందంటూ నెగటివ్ వార్తలు రాయొద్దని మీడియా ప్రతినిధులను కోరారు.

గతంలో తొలగించిన పారిశుధ్య కార్మికులను త్వరలోనే విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. నగరంలోని అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు గడువు ఇవ్వడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం ప్రజలు స్థానిక ఎమ్మెల్యే లేదా మంత్రికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. స్వచ్ఛ కార్యక్రమాలను పరిశీలించేందుకు పలు బృందాలు ఢిల్లీ, నాగపూర్‌లలో పర్యటిస్తాయని తెలిపారు.

శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ను సమైక్య పాలకులు నాశనం చేశారన్నారు. హైదరాబాద్ కష్టాలు.. నష్టాలే.. ఇక ఇప్పుడైనా హైదరాబాద్‌ను బాగు చేసుకోవాలని చెప్పిన ఆయన, ఓ మంచి కార్యక్రమానికి సోమవారం అడుగు పడిందని తెలిపారు.

CM KCR Launches Swachh Auto Trolley In Hyderabad

‘ఆటో ట్రాలీలు, చెత్త బుట్టల పంపిణీనికి నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ 1005 ఆటో ట్రాలీలు.. చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో 42లక్షల చెత్త బుట్టలు అవసరం. నవంబర్ నెలఖారు వరకు చెత్తబుట్టలు పంపిణీ చేస్తాం' అని సిఎం కెసిఆర్ చెప్పారు.

ఇక నగరంలో పేదరికాన్ని తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తున్నామని, నగరానికి 30 టీఎంసీల నీళ్ల కోసం రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామని చెప్పారు. నగరంలోని రోడ్లన్ని అద్దాల్లా మెరిసేలా తయారు చేస్తామని సీఎం తెలిపారు.

నీలి రంగులో పొడి చెత్త.. ఆకు పచ్చలో తడి చెత్త

హైదరాబాద్ మహానగరంలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేందుకు ప్రభుత్వం రెండు రకాల చెత్త బుట్టలను ఆవిష్కరించింది. పొడి చెత్త, తడి చెత్త సేకరణ కోసం నీలి రంగు, ఆకు పచ్చ రంగు బుట్టలను సీఎం కేసీఆర్ పంపిణీ చేశారు.

చెత్త మేనేజ్‌మెంట్‌పై అధ్యయనం చేసిన తర్వాత ఈ రెండు రకాల చెత్త బుట్టలను రూపొందించినట్లు సీఎం తెలిపారు. కూరగాయలు, అన్నం నుంచి వచ్చే తడి చెత్తను ఆకు పచ్చ బుట్టలో వేయాలి. ప్లాస్టిక్, కాగితాలు లాంటి చెత్తను నీలి రంగు బుట్టలో వేయాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+