పార్లమెంటులో ఆ రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టండి: మోడీకి కేసీఆర్ లేఖ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. చట్టసభల్లో బీసీలు, మహిళలకు రిజర్వేషన్ బిల్లులు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ, ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. ఈ రెండు బిల్లులను సెప్టెంబర్ 18 నుంచి జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ(ఓబీసీ) బిల్లు, మహిళా బిల్లు.. ఈ రెండు బిల్లులను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే దిశగా బీఆర్ఎస్ ఎంపీలు చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై పార్లమెంటరీ పార్టీ సుధీర్ఘంగా చర్చించింది.

మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు కేంద్రాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తునే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దిశగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ డిమాండ్లను రాజ్యసభ, లోక్‌సభల్లో ఎంపీలు లేవనెత్తాలని అధినేత సీఎం కేసీఆర్ సూచించారు. తమ గళాన్ని వినిపించాలని దిశానిర్దేశం చేశారు.
తమ తమ వృత్తులను తర తరాలుగా నిర్వర్తిస్తూ దేశ సంపద సృష్టిలో కీలక భాగస్వాములైన సబ్బండ వృత్తి కులాలైన బీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యత దిశగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం సుధీర్ఘంగా చర్చించింది. ఉత్పత్తిలో భాగస్వాములవుతూ, సభ్య సమాజానికి సేవలందిస్తూ, దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉంటున్న బీసీ(ఓబీసీ) కులాలను సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో మరింత దేశవ్యాప్తంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వం మీద ఉందని సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు కార్యాచరణ సత్పలితాలనిస్తున్నాయని, అవి దేశానికే ఆదర్శంగా నిలిచాయని సమావేశం విశ్లేషించింది. ముఖ్యంగా.. రాజకీయ అధికారంలో బీసీల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వారి సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పునరుద్ఘాటించింది. అందులో భాగంగా బీసీ (ఓబీసీ)లకు పార్లమెంటు అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ దిశగా ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత నిర్వహించిన మొదటి అసెంబ్లీ సెషన్‌లోనే(14 జూన్ 2014) బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందనే విషయాన్ని సమావేశం గుర్తుచేస్తూ చర్చించింది. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపి తొమ్మిదేళ్లు గడుస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మౌనం వహిస్తూ, బీసీ రిజర్వేషన్లపై తాత్సారం వహించడం పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సామవేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది.
Telangana CM K Chandrashekar Rao wrote to Prime Minister Narendra Modi urging him to pass the women's reservation bill in the special session of Parliament beginning September 18. pic.twitter.com/clj5GmAWrn
— ANI (@ANI) September 15, 2023
పార్లమెంటు, అసెంబ్లీ చట్టసభల్లో బీసీలకు సరైన ప్రాధాన్యతదక్కినప్పుడే వారి సమ్మిళితాభివృద్ధి సాధ్యమౌతుందని పునరుద్ఘాటించింది. ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించకుండా బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి వారికి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందే దిశగా చిత్తశుద్దితో చర్యలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సమావేశం మరోసారి డిమాండ్ చేసింది. సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ.. కేసీఆర్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
మహిళా రిజర్వేషన్ కోసం ఏకగ్రీవ తీర్మానం
సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురుషునితో సమానంగా రాణించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం పునరుద్ఘాటించింది. మహిళల్లో దాగివున్న శక్తిని వెలికితీసి వారికి సహకరిస్తూ వారిని అభివృధ్ధిలో భాగస్వాములను చేసినప్పుడు మాత్రమే ఏ సమాజమైనా కూడా ప్రగతి పథంలో పయనిస్తుందనే వాస్తవాన్నిస్పష్టం చేసింది. ఈ దిశగా అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదాహరణలతో సహా విశ్లేషించింది.
తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ దేశానికే ఆధర్శంగా నిలిచిందని సమావేశం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మహిళల భాగస్వామ్యాన్ని రాజకీయ అధికారంలో కూడా మరింతగా పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అందులో భాగంగా సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటరీ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా బిల్లును ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ, కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
మహిళాభ్యున్నతి పట్ల చిత్తశుద్దిని ప్రదర్శిస్తూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి మహిళా రిజర్వేషన్లపై లేఖ రాశారు. కాగా, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications