సీఎం కేసీఆర్ సంచలనం, అభ్యర్దుల తొలి జాబితా సిద్దం - ఛాన్స్ దక్కేదెవరికి..!!

ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నారు. ప్రతిపక్షాల కంటే ముందుగానే ప్రజల మధ్యకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా పార్టీ అభ్యర్ధుల జాబితా ప్రకటనకు నిర్ణయించారు. ఇందు కోసం ముహూర్తం ఖరారు చేసారు. 60 మందితో జాబితాను సిద్దం చేసినట్లు సమాచారం. దీంతో, ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.

తొలి జాబితాకు రంగం సిద్దం:
ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్దుల తొలి జాబితా విడుదలకు సిద్దమయ్యారు. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావటంతో ఇక ఎన్నికలకు సమరశంఖం పూరించాలని నిర్ణయించారు. ఈ నెల 21న పార్టీ అభ్యర్దుల తొలి జాబితా ప్రకటనకు డిసైడ్ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెబుతున్నారు.

CM KCR

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 88 మంది ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలోకి చేరారు. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. వీరిలో 60 మందికి తిరిగి సీట్లు ఇస్తూ తొలి జాబితా ప్రకటకు వీలుగా కేసీఆర్ నిర్ణయించారు.

హ్యాట్రిక్ లక్ష్యంగా అడుగులు
రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుస విజయాలతో అధికారం దక్కించుకుంది. ఈ సారి గెలవటం ద్వారా హ్యాట్రిక్ కొట్టటంతో పాటుగా రాష్ట్రంలో మరోపార్టీకి అవకాశం లేకుండా చేయాలనేది కేసీఆర్ వ్యూహం. ఇందు కోసం ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా ఆకర్షణీయ నిర్ణయాలు ప్రకటించారు.

పెండింగ్ లో ఉన్న రుణమాఫీ అమలుకు నిర్ణయించారు. అదే విధంగా ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ పైన ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది. ఇక, క్షేత్ర స్థాయిలో సర్వేలు చేయించి..పూర్తి స్థాయిలో సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్దులతో జాబితా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. సీట్లు దక్కే అవకాశం లేని వారితో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించారు.

CM KCR

గెలుపే ప్రామాణికంగా నిర్ణయం
మూడు రకాల క్షేత్ర స్థాయి సర్వేల ద్వారా అభ్యర్దుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో మంత్రుల్లో ఇద్దరు మినహా మిగిలిన వారు ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అదే విధంగా కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన వారికి సీట్లు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. 21న తొలి జాబితా, ఈ నెలలోనే రెండో జాబితాలో మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్దులను ప్రకటించి ప్రజల మధ్యకు పంపాలనేది సీఎం కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.

సర్వే నివేదికలు అనుకూలంగా లేని వారిని పక్కన పెడుతున్నారని సమాచారం. గెలుపే ప్రామాణికంగా అభ్యర్దుల ఎంపిక ఉంటుందని ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో, తొలి జాబితాలో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+