ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ - ఐఆర్, సీపీఎస్ పై ప్రకటనకు రంగం సిద్దం..!!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఉద్యోగులు నిరీక్షిస్తున్న విధంగా పీఆర్సీ ఏర్పాటుతో పాటుగా మ‌ధ్యంత‌ర భృతి ప్రకటన దిశగా కసరత్తు జరుగుతోంది. అదే విధంగా సీపీఎస్ రద్దు డిమాండ్ పైన ప్రభుత్వం కీలక అడుగులు వేసేందుకు రంగం సిద్దపడుతోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం ఈహెచ్‌ఎస్‌పైనా కూడా నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది.

ఉద్యోగులకు వరాలు: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు వరాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఉద్యోగుల వేతనాలు, మాజీ ఉద్యోగుల పెన్షన్ల పెంపు కోసం త్వరలోనే వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వారంలోనే పీఆర్సీ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి.

CM KCR Likely to appoint PRC and announce IR for Employees soon, may take decision on CPS

ఇదే అంశంపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. టీఎన్జీవోల సంఘం నేతలు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. పలు డిమాండ్లను ఆయన ముందు పెట్టారు. ముఖ్యంగా వెంటనే పీఆర్సీ ఏర్పాటును ప్రకటించాలని కోరారు. మంత్రి కూడా పీఆర్సీని ఏర్పాటు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు.

పీఆర్సీ నియామకం..ఐఆర్ ప్రకటన: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన మొదటి పీఆర్సీ అమలు కాలం ఈ జూన్‌ 30తో ముగిసింది. జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు రావాలి. పీఆర్సీని ఏర్పాటు చేయడంతో పాటు జూలై 1 నుంచి మధ్యంతర భృతి(ఐఆర్‌)ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఉపాధ్యాయ సంఘాలు కూడా ఐఆర్‌ ఎంత అడగాలన్న దానిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం సమయంలో వచ్చే ప్రతిపాదనల ఆధారంగా నిర్ణయం సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకు వచ్చే వరకు ఐఆర్‌ ఇవ్వనున్నారు. ఈహెచ్‌ఎస్‌ మీద ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

సీపీఎస్..ఈహెచ్‌ఎస్‌పైనా: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) పైనా రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. 2004 సెప్టెంబర్‌ నుంచి నియమితులైన ఉద్యోగులు ప్రస్తుతం సీపీఎస్‌ కింద ఉన్నారు. ఇలాంటి 1.20 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీపీఎ్‌సను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.

సీపీఎస్ ను రద్దుపై అధ్యయన కమిటీని వేయాలని కోరింది. కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచారం. ఉద్యోగుల హౌసింగ్‌పై కూడా ప్రకటన వస్తుందనే చర్చ జరుగుతోంది. మొత్తంగా ఉద్యోగులకు వరాలు ప్రకటించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+