మీకేంటి.. తెలంగాణ ధనిక రాష్ట్రం కదా: కేసీఆర్‌తో జైట్లీ వ్యాఖ్య (ఫోటోలు)
న్యూఢిల్లీ: దేశంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ర్టాల్లో గుజరాత్ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉన్నప్పటికీ, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు సహకరించాలని కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు.
ద్రవ్య సంస్థల రుణ పరిమితి (ఎఫ్‌ఆర్‌బిఎం) మూడు నుంచి 3.5 శాతానికి పెంపు, కేంద్ర పథకాల్లో రాష్ట్రంవాటా పెంపు, హెచ్‌ఎండిఏకు ఆదాయం పన్ను మినహాయింపు కల్పించాలంటూ సీఎం కేసీఆర్ కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదించారు. అయితే, ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి జాతీయ రహదారులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై నీతిఆయోగ్ ఉపకమిటీ నివేదికను ప్రధాని మోడీకి సమర్పిస్తున్న నేపథ్యంలో కమిటీ సభ్యుడిగా ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ మంగళవారం కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలను కలిసి పలు అంశాలపై చర్చించారు.

రుణ పరిమితి పెంచండి: జైట్లీతో కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిందని, వీటికి అవసరమైన ఆర్థికవనరులను సమకూర్చుకోడానికి ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని కోరారు. అదనపు బడ్జెట్ కలిగిన రాష్ర్టాలు వివిధ ద్రవ్యసంస్థల నుంచి రుణాన్ని తీసుకునే గరిష్ట పరిమితిని పెంచవచ్చంటూ ఇటీవల 14వ ఆర్థిక సంఘం తన సిఫారసుల్లో పేర్కొన్నదని, ఇందుకు అవసరమైన అన్ని అర్హతలూ తెలంగాణకు ఉన్నాయని వివరించారు.

రుణ పరిమితి పెంచండి: జైట్లీతో కేసీఆర్
అనేక రాష్ర్టాలు విద్యుత్ రంగంలో లక్షల కోట్ల రూపాయలమేర బకాయిపడిన నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితిని పెంచడానికి కేంద్రం సుముఖత చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణకు ఆర్థికసంఘం మార్గదర్శకాల ప్రకారం కూడా అదనపు రుణపరిమితి పొందేందుకు అన్ని అర్హతలూ ఉన్నట్లు కేసీఆర్ వివరించడం గమనార్హం.

రుణ పరిమితి పెంచండి: జైట్లీతో కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్‌తో పాటు అనేక పట్టణాభివృద్ధి పథకాల్లో ఎక్కువగా ప్రథమ శ్రేణి పట్టణాలపైనే దృష్టి సారించిందని, సమీప భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుంటే ద్వితీయ శ్రేణి పట్టణాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్రమంత్రికి కేసీఆర్ వివరించారు. స్మార్ట్‌సిటీలకు ఎంపికైన అనేక నగరాల్లో ఈ పథకం ద్వారా లభిస్తున్న కేంద్ర ఆర్థికసాయం కంటే స్థానికంగా వివిధరూపాల్లో ఆర్జిస్తున్న ఆదాయమే ఎక్కువగా ఉన్నదని, అందువల్ల పట్టణాభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలంటే ద్వితీయ శ్రేణి పట్టణాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

రుణ పరిమితి పెంచండి: జైట్లీతో కేసీఆర్
హైదరాబాద్ అభివృద్ధి గురించి వివరిస్తూ, ఇప్పటికే గణనీయమైన స్థాయిలో అభివృద్ధి చెందిన ఈ మహానగరానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నదని, దీనిని మరింతగా అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. నగరంలో బహుళ అంతస్థుల భవనాలతో పాటు ప్లై ఓవర్లు, స్కైవేలు మొదలైనవి నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, ఇలాంటివాటికి కూడా కేంద్రం నుంచి తగిన సహకారం అవసరమవుతుందని అన్నారు.

రుణ పరిమితి పెంచండి: జైట్లీతో కేసీఆర్
ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం ఆయనతో సుమారు అరగంటకు పైగా భేటీ అయిన కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల గురించి వివరించారు. కేసీఆర్ వెంట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రు తెజావత్, వేణుగోపాలచారి, ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు ఉన్నారు.

రుణ పరిమితి పెంచండి: జైట్లీతో కేసీఆర్
రాష్ట్రంలో కొత్తగా 1500 కి.మీ. మేరకు జాతీయ రహదారుల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టమైన హామీ ఇచ్చారు. గడ్కరీని కలిసిన సందర్భంగా రాష్ట్రంలో రహదారుల పరిస్థితి, అవసరాలపై విజ్ఞాపన పత్రాలను సీఎం అందజేశారు.

రుణ పరిమితి పెంచండి: జైట్లీతో కేసీఆర్
వీటికి సానుకూలంగా స్పందించిన గడ్కరీ ఎనిమిది కీలక రహదారులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుంది. తెలంగాణలో గోదావరి నది ప్రవేశించే కౌటాల మొదలు కాళేశ్వరంవరకు నదీతీరం వెంబడి జాతీయ రహదారి నిర్మాణం కూడా ఇందులో ఉంది.

రుణ పరిమితి పెంచండి: జైట్లీతో కేసీఆర్
దీనిపై సత్వరమే ప్రాజెక్టు రిపోర్టు ఇస్తే వెంటనే ప్రకటన విడుదల చేస్తామని కూడా కేసీఆర్‌కు గడ్కరీ చెప్పారు. జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి (నం.563) ఖమ్మం జిల్లా వరకు పొడిగింపుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. భద్రాచలం-విజయవాడలను కలుపుతూ రెండు లైన్ల జాతీయ రహదారిని (నం.30) కేంద్రం మెరుగుపరుస్తున్నది. ఇందులో సుమారు 60.75 కి.మీ. మేర రెండులైన్లను ఉంచుతూ 33.50 కి.మీ. మేర నాలుగు లైన్ల రహదారిగా మార్చనున్నారు.

రుణ పరిమితి పెంచండి: జైట్లీతో కేసీఆర్
ఎన్టీపీసీ, నవభారత్ ఫెర్రో అల్లాయ్స్, ఐటీసీ పేపరుమిల్లు, హెవీ వాటర్ ప్లాం ట్ తదితర పరిశ్రమలు ఉన్న ఈ రహదారిలో భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అందువల్ల కొత్తగూడెం-భద్రాచలం మధ్య కూడా నాలుగు లైన్ల రహదారి నిర్మించాలని సీఎం కోరారు.

రుణ పరిమితి పెంచండి: జైట్లీతో కేసీఆర్
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రాయోజిత సంక్షేమ పథకాల హేతుబద్ధీకరణపై అధ్యయనం చేసిన నీతి ఆయోగ్ సబ్ కమిటీ తన తుదినివేదికను ప్రధాని నరేంద్రమోడీకి మంగళవారం సాయంత్రం సమర్పించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఏర్పడిన ఈ సబ్‌కమిటీలో అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, తెలంగాణ, జార్ఖండ్, కేరళ, అండమాన్ తదితర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉన్నారు.

రుణ పరిమితి పెంచండి: జైట్లీతో కేసీఆర్
గతంలో ముసాయిదా నివేదికను సమర్పించిన ఈ కమిటీ మంగళవారం తుది నివేదికను సమర్పించింది. నివేదిక సమర్పించిన బృందంలో శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మణిపూర్ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో పాటు అండమాన్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కూడా ఈ బృందంలో ఉన్నారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పణగరియా ఈ నివేదిక గురించి ప్రధానికి వివరించారు.












Click it and Unblock the Notifications