ఎస్‌ఐ సిద్ధయ్యకు కేసీఆర్ పరామర్శ, భరోసా(ఫోటోలు)
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో సిమి ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో తీవ్రంగా పోరాడి, తీవ్ర గాయాలపాలైన ఎస్‌ఐ సిద్ధయ్యను సీఎం కే చంద్రశేఖర్‌రావు సోమవారం పరామర్శించారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి చేరుకున్న ఆయనకి వైద్యుల బృందం సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న చికిత్సను వివరించారు.
కేసీఆర్‌కు శరీరంలోకి దూసుకుపోయిన నాలుగు బుల్లెట్లలో రెండింటిని తొలగించామని, మరో రెండు బుల్లెట్లు శరీరంలోనే ఉన్నాయని చెప్పారు. ఒకటి తల భాగంలో ఉండగా, మరొకటి కడుపు భాగంలో ఉందని వారు వివరించారు. మిగిలిన రెండు బుల్లెట్ల వల్ల ప్రస్తుతం సిద్ధయ్యకు ఎలాంటి ప్రమాదంలేదని, తాము అందిస్తున్న వైద్యానికి ఆయన ఏమాత్రం స్పందించినా తదుపరి బుల్లెట్లను తొలగించే విషయం పరిశీలిస్తామని వైద్యులు సీఎం కేసీఆర్‌కి వివరించారు.
ప్రస్తుతం సిద్ధయ్య ఆరోగ్యం బాగా క్షీణించిందని, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వారు సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం ఆసుపత్రి బయట ఉన్న సిద్ధయ్య కుటుంబసభ్యులను ఆయన ఓదార్చారు.

సిద్ధయ్య కుటుంబానికి కేసీఆర్ పరామర్శ, భరోసా
నల్లగొండ జిల్లాలో సిమి ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో తీవ్రంగా పోరాడి, తీవ్ర గాయాలపాలైన ఎస్‌ఐ సిద్ధయ్యను సీఎం కే చంద్రశేఖర్‌రావు సోమవారం పరామర్శించారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి చేరుకున్న ఆయనకి వైద్యుల బృందం సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందిస్తున్న చికిత్సను వివరించారు.

సిద్ధయ్య కుటుంబానికి కేసీఆర్ పరామర్శ, భరోసా
సిద్ధయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆయనను బతికించుకునేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలూ తీసుకుంటుందన్నారు. అవసరమైతే విదేశీ వైద్య నిపుణులను ఇక్కడికి పిలిపించేందుకైనా, లేదంటే సిద్ధయ్యనే అక్కడికి తరలించేందుకైనా సిద్ధమని, ఇందుకు ఎంత ఖర్చయినా వెనుకాడేదిలేదని సీఎం చెప్పినట్లు సిద్ధయ్య సోదరుడు దస్తగిరి తెలిపారు. ఎలాగైనా సిద్ధయ్యను బతికించుకుందామని, అధైర్యపడొద్దని సీఎం ధైర్యం చెప్పారని అన్నారు.

సిద్ధయ్య కుటుంబానికి కేసీఆర్ పరామర్శ, భరోసా
కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆస్పత్రి సీఈవో మహేందర్‌రెడ్డి సోమవారం తెలిపారు. రెండు బుల్లెట్లను తొలగించిన అనంతరం ఆయనకు వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్త్తున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదన్నారు. సిద్ధయ్య శరీరం అనుకున్న స్థాయిలో చికిత్సకు సహకరించడంలేదని, అయినప్పటికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని వివరించారు.

సిద్ధయ్య కుటుంబానికి కేసీఆర్ పరామర్శ, భరోసా
ఎదురు కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి కామినేని ఆస్పత్రి నుంచి సోమవారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. సీఐకి కడుపు భాగంలో అయిన గాయానికి రెండురోజులపాటు చికిత్స చేసినట్లు, ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications