సోషల్ మీడియాలో తెలంగాణా సీఎంఓ హవా .. ట్విట్టర్ లో కేసీఆర్ కార్యాలయం నం.1, ఫేస్ బుక్ లో మూడో స్థానం
సోషల్ మీడియా వేదికల ద్వారా సీఎం కేసీఆర్ కార్యాలయం ప్రజలకు చేరువ కావడంలో ఒక సెన్సేషన్ సృష్టించింది . 2020 ఏప్రిల్ 1 నుండి 2021 మార్చి 31 మధ్య సేకరించిన గణాంకాల ప్రకారం అటు ట్విట్టర్లో, ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగిన జాబితాలో సీఎం కేసీఆర్ కార్యాలయమే దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇక ఫేస్ బుక్ లో తెలంగాణ సీఎంవో మూడో స్థానంలో నిలిచింది.

ట్విట్టర్లో మొదటి స్థానంలో తెలంగాణ సీఎంఓ
ట్విట్టర్లో మొదటి స్థానంలో తెలంగాణ సీఎంఓ ఉండగా ఇక రెండవ స్థానంలో హర్యానా సీఎంఓ , మూడవ స్థానంలో మహారాష్ట్ర సీఎంఓ , నాలుగవ స్థానంలో ఒడిశా సీఎంఓ , ఐదవ స్థానంలో మధ్యప్రదేశ్ సీఎంఓ అకౌంట్స్ ఉన్నాయి. ప్రతి వెయ్యి మంది జనాభా కు ఉన్న ఫాలోవర్ ల ప్రాతిపదికన చూస్తే సీఎం కేసీఆర్ కార్యాలయం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఫాలోవర్స్ పరంగా గతేడాది పది లక్షల మైలురాయిని దాటిన తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ ఖాతా ప్రస్తుతం 11.21 లక్షల మంది ఫాలోవర్స్ తో ముందు వరుసలో నిలిచింది.

ఫేస్ బుక్ లోనూ ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగి మూడో స్థానంలో తెలంగాణా సీఎంఓ
రాష్ట్రంలోని 3.5 కోట్ల జనాభా కి గాను ప్రతి వెయ్యి మందిలో 33.18 మంది తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ ఖాతా ను ఫాలో అవుతున్నారు అంటే అతిశయోక్తి లేదు. ఇక ఇదే విధంగా మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ లోనూ ఎక్కువ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సీఎంఓ ల జాబితాలో తెలంగాణ సీఎంఓ మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఫేస్ బుక్ లో తొలి స్థానంలో రాజస్థాన్ సీఎంవో ఖాతా 26.8 1 లక్షల మంది ఫాలోవర్స్ తో ఉండగా, తెలంగాణ సీఎంఓ అకౌంట్ 8.43 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

సీఎంఓ నుండి ఏమైనా తెలుసుకోవాలంటే సోషల్ మీడియా ఫాలో అవుతున్న నెటిజన్లు
సీఎం కేసీఆర్ నిర్వహించే క్యాబినెట్ సమావేశాలు, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాలు, పర్యటనల వివరాలు, ప్రభుత్వం తీసుకునే వివిధ నిర్ణయాలు ఎప్పటికప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ట్విట్టర్ , ఫేస్ బుక్ సీఎంఓ ఖాతా ద్వారా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం వల్ల, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తెలుసుకోవడం కోసం చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతున్నారు.












Click it and Unblock the Notifications