వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mulayam Singh Yadav: రాజకీయ మల్లయోధుడికి నివాళులు అర్పించిన కేసీఆర్..

|
Google Oneindia TeluguNews

ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు దివంగత ములాయం సింగ్‌ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కేసీఆర్‌ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవు, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. ఉత్త‌ర్‌ప్రదే‌శ్‌‌లోని ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వ్రగామం సైఫయీలో ములాయం సింగ్ యాదవు అంత్యక్రియలకు కేసీఆర్ హాజరయ్యారు. అఖిలేష్‌ యాదవ్‌ను పరామర్శించారు.

ఢిల్లీకి కేసిఆర్..!
ములాయం అంత్య‌క్రియ‌లు ముగిసిన అనంత‌రం ఇవాళ సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారు. మూడు, నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుతూ తీర్మానం చేసిన త‌ర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్ ప‌లువురు జాతీయ నాయ‌కులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ఇతర పార్టీల ప్రముఖలతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

CM KCR paid tributes to Mulayam Singh Yadav

చంద్రబాబు
అంతకు ముందు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ములాయం సింగ్ యాదవుకు నివాళలులు అర్పించారు. ములాయంతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. అఖిలేష్ యాదవుకు ధైర్యం చెప్పారు. ములాయం అంత్యక్రియల అనంతరం విజయవాడకు బయలుదేరుతారు చంద్రబాబు. ములాయం సింగ్ యాదవు అనారోగ్య సమస్యలతో కొంత కాలంగా బాధపడుతున్నారు. ఆయనను ఈ నెల రెండో తేదీన గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే సోమవారం కన్నమూశారు.

English summary
CM KCR paid tributes to the late Mulayam Singh, former Chief Minister of Uttar Pradesh and founder of the Samajwadi Party. He prayed to God to rest his soul in peace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X