హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కమాండ్ కంట్రోల్ సెంటర్ ఊహించనది: అందుకు ప్రతీక, పోలీసులపై కేసీఆర్ ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారంటూ ప్రశంసించారు సీఎం కేసీఆర్. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం రూపకర్త డీజీపీ మహేందర్‌రెడ్డి అని ఈ సందర్భంగా కొనియాడారు. గురువారం కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసుశాఖకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. డీజీపీ మహేందర్​ రెడ్డి కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నిర్మాణానికి ఎంతో శ్రమించారని సీఎం ప్రశంసించారు. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నిర్మాణంలో
ఆర్‌అండ్‌బీ కూడా కృషి చేసిందన్నారు.

భారతదేశానికి తెలంగాణ పోలీసులు అదర్శం: కేసీఆర్

భారతదేశానికి తెలంగాణ పోలీసులు అదర్శం: కేసీఆర్

భారతదేశ వ్యవస్థకే తెలంగాణ పోలీసు ఒక కలికితురాయి అని కేసీఆర్ అభివర్ణించారు. నేరాలు చేసే విధానంలో ఎన్నో మార్పులు వస్తున్నాయన్న సీఎం కేసీఆర్... పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలని అన్నారు. శక్తివంతమైన దేశం అమెరికా విధానాలను అమలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని సీఎం కేసీఆర్ సూచించారు. పోలీస్‌శాఖకు ప్రభుత్వ అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. భారతదేశానికే తెలంగాణ పోలీసుశాఖ ఆదర్శంగా నిలవాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థ ఏర్పడాలనేదే తన అభిమతం అని స్పష్టం చేశారు.

పోలీసులకు సెల్యూట్ అంటూ కేసీఆర్

పోలీసులకు సెల్యూట్ అంటూ కేసీఆర్

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వస్తుందని ఎవరూ ఊహించలేదని పేర్కొన్నారు. సంకల్ప బలానికి ప్రతీక కమాండ్‌ కంట్రోల్ కేంద్ర భవనం అని తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పోలీసులు మరింత సేవ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. లక్ష్యాల సాధనలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయన్న సీఎం... రాష్ట్రంలో ఎక్కడ విపత్తు తలెత్తినా పోలీసుశాఖ ముందుంటుందని వెల్లడించారు. ఉత్తమ పోలీసు వ్యవస్థ ఉంటే సమాజం బాగుంటుందన్నారు. సమాజ హితం కోసం సంస్కరణలు తీసుకొస్తున్న పోలీసులకు సెల్యూట్‌ అని అన్నారు.

మహేందర్ రెడ్డి సేవలను వినియోగించుకుంటామన్న కేసీఆర్

మహేందర్ రెడ్డి సేవలను వినియోగించుకుంటామన్న కేసీఆర్

సైబర్‌ క్రైమ్స్‌ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్. డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సైబర్‌ క్రైమ్స్‌పై దృష్టిసారించాలని ఆదేశించారు. భవిష్యత్‌ తరాల బంగారు భవితను డ్రగ్స్‌ నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరాన్ని నియంత్రించేందుకు పోలీసుశాఖ ప్రధాన పాత్ర పోషించాలన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ఏకే ఖాన్‌ అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. డీజీపీ మహేందర్‌రెడ్డి డిసెంబర్‌లో పదవీవిరమణ చేస్తున్నారని తెలిపారు. మహేందర్‌రెడ్డి సేవలను మరో రూపంలో తీసుకుంటామన్నారు.

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలెన్నో..

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలెన్నో..

హైదరాబాద్‌లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా వెంటనే తెలుసుకునేలా సీసీటీవీ కెమెరాలన్నీ ఒకే చోట అనుసంధానం చేస్తూ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఏకకాలంలో లక్ష సీసీ కెమెరాలు వీక్షించేలా ఏర్పాటు చేసిన బాహుబలి తెరఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రంలో 5 టవర్లు ఏర్పాటుటవర్- 'ఏ'లో 20 అంతస్థులు ఉన్నాయి.

ఇందులోని నాలుగో అంతస్తులో డీజీపీ ఛాంబర్, ఏడో అంతస్తులో సీఎం, సీఎస్ ఛాంబర్లు ఉన్నాయి. 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది. టవర్ 'డీ'లో తెలంగాణ పోలీస్ చరిత్రను, ప్రాసస్త్యాన్ని తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేశారు. మొదటి కొత్వాల్ రాజ బహుదూర్ కాలం నుంచి పోలీస్ వ్యవస్థ ఎలా పని చేసిందని వివరాలు తెలిపే ఫొటో గ్రాఫ్స్‌ను ఉంచారు.

గతంలో నేరస్తులను పట్టుకోవడంతో పాటు వారి కదలికలను గుర్తించడానికి వినియోగించిన కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ సాధనాలను అందుబాటులో ఉన్నాయి. టవర్‌-ఈలో కమాండ్‌ కంట్రోల్‌ డాటా సెంటర్‌ ఉంది. కాగా, 24 గంటలపాటు షిప్టుల వారీగా సిబ్బంది పనిచేయనున్నారు. సీసీ దృశ్యాలు నిక్షిప్తం చేసేందుకు భారీ సర్వర్లు ఏర్పాటు చేశారు.

English summary
cm kcr praises command control centre and police department
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X