నన్ను మించిన అద్భుతం: ఆరడుగుల బుల్లెట్ అంటూ హరీశ్ రావుపై కేసీఆర్, దాబాలో చాయ్

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుపై ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో సిద్దిపేట అంటేనే ఒక గౌరవం, ప్రత్యేకత ఉందని.. తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది సిద్దిపేట గడ్డ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

సిద్దిపేట పేరు వింటే స్వర్గం కంటే నా జన్మభూమి గొప్పదనే భావన కలుగుతుందని కేసీఆర్ అన్నారు. ప్రతీ సందర్భంలో సిద్దిపేట తనను విజేతగా నిలబెట్టిందని గుర్తు చేసుకున్నారు. సిద్దిపేటలో మంచినీళ్ల కరవు వస్తే.. వాటర్‌ ట్యాంకర్లతో నీళ్లు తెప్పించామని తెలిపారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మిషన్​ భగీరథ పథకం అమలవుతుందంటే.. సిద్దిపేట మంచినీళ్ల పథకమే దానికి పునాది అని కేసీఆర్ పేర్కొన్నారు.

CM KCR praises minister Harish rao in siddipet brs public meeting

సిద్దిపేటలో తాను తిరగని రోడ్డు, గ్రామం, చెరువు లేదన్న సీఎం.. ఒకప్పుడు బంగారం లాంటి భూములు ఉన్నా పంటలు పండించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిందే సిద్దిపేట గడ్డ అన్నారు. 50 సంవత్సరాల పాటు సిద్దిపేట ప్రజలతో కలిసి మెలిసి బతికానని చెప్పారు.

ఈ సందర్భంగా హ‌రీశ్‌రావుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆరు అడుగుల బుల్లెట్ హ‌రీశ్‌రావు.. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు, బ్ర‌హ్మాండంగా సిద్దిపేట‌ను అభివృద్ధి చేశార‌ని కేసీఆర్ కొనియాడారు. తన కంటే బాగా పనిచేస్తున్నారన్నారు. ఇక సిద్దిపేట‌కు అన్ని వ‌చ్చాయ్.. ఒక గాలి మోటార్ రావాల్సి ఉంద‌ని కేసీఆర్ అన్నారు.

నేను సిద్దిపేటను విడిచి వెళ్లిన త‌ర్వాత వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో నేను తీసుకొచ్చి ఓ ఆరు అడుగుల బుల్లెట్ హ‌రీశ్‌ను మీకు అప్ప‌గిస్తే.. బ్ర‌హ్మాండంగా నేను ఊహించిన దాని కంటే ఎన్నో రెట్లు బ్ర‌హ్మాండంగా ప‌ని చేసి నా మాట‌ను నిల‌బెట్టాడు. మీ గౌర‌వాన్ని కాపాడాడు అని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు కేసీఆర్. నిజంగా హ‌రీశ్ జాగ‌లా నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంత చేయ‌గ‌లుగుదోనో లేదో నాకు తెల్వ‌దు. అంత అద్భుతంగా ప‌ని చేస్తున్నారు అని కేసీఆర్ కొనియాడారు.

నేను ఇంత‌కన్న ఎక్కువ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సిద్దిపేట‌కు నీళ్లు, రైళ్లు వ‌చ్చాయి. క‌న్నీరు కార్చిన సిద్దిపేట‌లో చెక్ డ్యాంల‌న్నీ ప‌న్నీరు కారిన‌ట్టు మ‌త్త‌ల్లు దుంకుతున్నాయి. ఆ ఫోటోలు చూసి సంతోష‌ప‌డుతున్నాను. నంగునూరు పెద్ద‌వాగు మీద చెక్ డ్యాంలు చూసిన‌ప్పుడు బ్ర‌హ్మాండంగా మ‌న‌సు పులకించి పోయింద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

అంతకుముందు మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బుల్లెట్‌ వేగంతో సిద్దిపేట రైలు మార్గాన్ని పూర్తి చేశామన్నారు. సిద్దిపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. దశాబ్దం క్రితం రాష్ట్రంలో కరవు తాండవించిందన్న హరీశ్ రావు.. ప్రస్తుతం 10 రాష్ట్రాలకు తెలంగాణ అన్నం పెడుతుందన్నారు. సిద్దిపేటకు గోదావరి నీళ్లను ఇచ్చి సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేశారన్నారు. సీఎంగా ఉన్నప్పటికీ.. రైతుబిడ్డ కేసీఆర్‌ వ్యవసాయం చేస్తున్నారని.. రైతుల్లో సీఎం కేసీఆర్‌ ధైర్యం పెంచారని అన్నారు. సీఎం కేసీఆర్‌ సిద్దిపేటలో కరవు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించారన్నారు. అందుకే తనకు శ్వాస ఉన్నంత వరకు సీఎం కేసీఆర్‌కు, సిద్దిపేట ప్రజలకు రుణపడి ఉంటానని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

దాబా వద్ద చాయ్ తాగిని సీఎం కేసీఆర్

కాగా, సభ అనంతరం ప్రయాణంలో మార్గమధ్యలో ఆగిన సీఎం కేసీఆర్, మంత్రి హరీవ్ రావు, నేతలు మధుసూదనాచారి, తదితరులు ఓ దాబా వద్ద ఆగి చాయ్ తాగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+