భద్రకాళి అమ్మవారికి 11కేజీల స్వర్ణకిరీటం సమర్పణ(పిక్చర్స్)
వరంగల్: భద్రకాళీ అమ్మవారిని ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దంపతులు దర్శించుకున్నారు. దుర్గాష్టమి పర్వదినం, అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా అమ్మవారికి రూ.3.7 కోట్ల వ్యయంతో తయారు చేయించిన 11.7 కిలోల స్వర్ణకిరీటం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భద్రకాళీ అమ్మవారు
సీఎం కేసీఆర్ దంపతులు భద్రకాళీ అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించుకున్నారు. దుర్గాష్టమి పర్వదినం, అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా ముఖ్యమంత్రి సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. రూ.3.70కోట్ల విలువ గల11 కిలోల 700 గ్రాముల బంగారు కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వర్ణ కిరీటం
ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరితే భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటంతోపాటు కురవి వీరభద్ర స్వామికి బంగారుమీసం, తిరుపతి వేంకటేశ్వరస్వామికి, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి కిరీటాలు సమర్పిస్తామని మొక్కుకున్న సంగతి తెలిసిందే.

కేసీఆర్ దంపతులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున భద్రకాళి అమ్మవారికి కిరీటం సమర్పించినట్లు సీఎం తెలిపారు. 2017 మార్చిలో కురవిలో జరిగే ఉత్సవాల్లో కురవి వీరభద్రస్వామికి మీసాలు సమర్పిస్తామని, తిరుపతి వేంకటేశ్వర స్వామి, విజయవాడ కనకదుర్గమ్మకు కూడా త్వరలోనే కిరీటాలను సమర్పిస్తామని తెలిపారు.

ఆలయంలో..
ఆలయ ప్రధాన అర్చకులు శేషు, ఈవో సునీత.. సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో శాసనసభ సభాపతి మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎంపీ వినోద్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

త్వరలోనే..
ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరితే భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటంతోపాటు కురవి వీరభద్ర స్వామికి బంగారుమీసం, తిరుపతి వేంకటేశ్వరస్వామికి, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి కిరీటాలు సమర్పిస్తామని మొక్కుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున భద్రకాళి అమ్మవారికి కిరీటం సమర్పించినట్లు సీఎం తెలిపారు. 2017 మార్చిలో కురవిలో జరిగే ఉత్సవాల్లో కురవి వీరభద్రస్వామికి మీసాలు సమర్పిస్తామని, తిరుపతి వేంకటేశ్వర స్వామి, విజయవాడ కనకదుర్గమ్మకు కూడా త్వరలోనే కిరీటాలను సమర్పిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications