కేసీఆర్ దిగ్భ్రాంతి: రెండు రోజులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్న కేటీఆర్

హైదరాబాద్: బుధవారం గ్రేటర్ హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన ప్రాణనష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, సీఎస్ రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, సీపీతో సీఎం మాట్లాడారు. మరో 24 గంటల పాటు వర్ష సూచన ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణతో పాటు సహాయక చర్యల్లో పాల్గొనాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్, డ్రైనేజీ, రహదారులు, మ్యాన్‌హోల్స్ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

నగర నలుమూలల నుంచి హుస్సేన్‌సాగర్‌కు భారీగా నీరు వచ్చి చేరుతున్నందున, అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయాలని అన్నారు. జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు ఎంప్పటికప్పుడు సమాచారం అందించడంతో పాటు అందుకు అనుగుణంగా అధికారులు వేగంగా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఉదయం కురిసిన కుండపోత వర్షానికి ఏడుగురు మృత్యువాత పడ్డారు. రామాంతపూర్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, భోలక్‌పూర్‌లో పాత ఇళ్లు కూలి తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.

జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్ రూంకు 203 ఫిర్యాదులు: మంత్రి కేటీఆర్

నగరంలో బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షం నేపథ్యంలో సాగర్ నుంచి 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటి మట్టం 513.30 మీటర్లుగా ఉందని చెప్పారు. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

నగరంలో కురిసిన కుండపోత వర్షం కారణంగా వేర్వేరు చోట్ల మృతి చెందిన మృతుల కుటుంబాలను కేటీఆర్ పరామర్శించి, సానుభూతి ప్రకటించారు. ఈ రెండు రోజులు నగర ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో వర్షాలపై కంట్రోల్ రూమ్‌లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పారు.

ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్ రూంకు 203 ఫిర్యాదులు అందాయని అన్నారు. వీటిలో 83 వాటిని పరిష్కరించామని వెల్లడించారు. ఫిర్యాదులపై ప్రభుత్వ యంత్రాంగం త్వరగా స్పందిస్తుందని తెలిపారు. బోలక్ పూర్‌లో ఒక ఇళ్లు కూలి బీరువా కింద మనుషులు ఇరుక్కున్నారు.

వారిని రకించేందుకు వెళితే కరెంట్ షాక్ వచ్చిందని స్థానికులు తెలిపారు. విద్యుత్ అధికారులకు తెలిపితే పట్టించుకోలేదని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. కొన్ని చోట్ల వర్షం వలన ప్రమాదం జరిగి విద్యుత్ షార్ట్ సర్య్యూట్ ఏర్పడిందని ఫిర్యాదులొచ్చినా విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోలేదని, వెంటనే స్పందించలేదని తమకు ఫిర్యాదులొచ్చాయని మంత్రి తెలిపారు.

కేటీఆర్

కేటీఆర్

హైదరాబాద్ నగరంలో బుధవారం కురిసిన కుంభవృష్టి వర్షం పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. జిహెచ్ఎంసి మేయర్, అధికారులు, ఇంజనీర్లతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ కురిసిన వర్షం సాధారణ కంటే మూడు రెట్లు అధికమని తెలిపారు.

కేటీఆర్

కేటీఆర్

నగరంలో 20 మి.మీ వర్షం కురిస్తే అది సాధారణమని, కానీ ఇవాళ అంతకు మించి 60మి.మీ వర్షం కురిసిందని, ఈ సీజన్ లో అదే అత్యధిక వర్షంగా భావిస్తున్నట్లు చెప్పారు. అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమేనన్నారు.

కేటీఆర్

కేటీఆర్

ప్రజలు ఇబ్బంది పడకుండా జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్, అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారన్నారు. కొన్నిచోట్ల ఒకటి రెండు దురదృష్టకర సంఘటనలు జరిగాయని, ఈ ఘటనల్లో దాదాపు 7 మంది వరకు చనిపోయినట్లు సమాచారం అందిందని చెప్పారు.

కేటీఆర్

కేటీఆర్

మృతుల కుటుంబాలకు ఇప్పటికే ప్రభుత్వం రూ. 2లక్షలు, జీహెచ్ఎంసీ రూ. 2లక్షలు కలిపి మొత్తం 4 లక్షల వరకు సహాయం చేస్తున్నట్లు చెప్పారు. జరిగిన సంఘటనలకు ఎవరినీ బాధ్యులను చేయలేమని, ఒక్కచోట మాత్రం విద్యుత్ అధికా���ులు స్పందించలేదని చెప్పారని, దానిపై శాఖపరమైన విచారణకు అదేశించామన్నారు

కేటీఆర్

కేటీఆర్

ఈ విషయాన్ని విద్యుత్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయన కూడా దీనిని మానిటర్ చేస్తున్నారన్నారు. నగరంలో మొత్తం 1,197 భవనాలు శిథిలావస్థలో ఉ్నట్లు అధికారులు గుర్తించారని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయమని అధికారులు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇచ్చ���రని, ఇందులో 50శాతం మంది ఖాళీ చేశారని, కొంత మంది స్వచ్ఛంధంగా కూల్చివేసుకున్నారని, మిగతావారు కూడా వారం రోజుల అదనపు గడువు కోరినట్లు చెప్పారు.

దీనిపై సంబంధిత అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ మెరుగైందని తెలిపారు. ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న భవనాలను జీహెచ్‌ఎంసీ తొలగించిందని తెలిపారు. నగరంలో 150 భవనాలను పునరుద్ధరిస్తామని తెలిపారు.

శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చి వేసుకోవాలని నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు పునరుద్దరించుకోవాలి లేదా వాటిని కూల్చి వేయాలని విజ్ఞప్తి చేశారు. మిగతా భవనాల యజమానులు కూడా స్పందించుకుంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.

మరి కొన్ని చోట్ల శిథిలావస్థలో ఉన్న భవనాల నుంచి ఖాళీ చేయాలని కూడా ఆదేశించామన్నారు. పురాతన భనవాలను ఖాళీ చేయాలి లేదా రిపేర్ చేయించుకోవాలని సూచించారు. శిధిలావస్తలో ఉన్న 940 భవనాల్లో 90 ఇప్పటికే కూల్చేశామని చెప్పిన మంత్రి కేటీఆర్ కోర్టు కేసులుండటం వల్ల కొన్ని భవనాల తొలగింపు మధ్యలోనే ఆగిపోయిందని పేర్కొన్నారు.

నగరంలో మొత్తం 1,197 భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని పేర్కొన్నారు. వర్షం కారణంగా మృతిచెందడం దురదృష్టకరమన్నారు. చనిపోయిన వారి కుటుంబ బంధువులకు జీహెచ్‌ఎంసీ తరపున రూ.2 లక్షలు ప్రకటిస్తున్నామని, ఆపద్బందు కింద మరో రూ.50 వేలు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.

ప్రభుత్వం కూడా రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని మొత్తం కలిపి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల వరకు నష్ట పరిహారం ఇప్పిస్తామన్నారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే జీహెచ్‌ఎంసీ టోల్ ఫ్రీ నెంబరు 040-21111111 నెంబర్లకు ఫోన్ చేయాలని, లేదా 100 నెంబరు ఫోన్ చేయొచ్చని మంత్రి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+