‘‘సీఎం కేసీఆర్ వి దరిద్రమైన ఆలోచనలు.. కాంగ్రెస్ గతే టీఆర్ఎస్ కూ..’’

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: బంగారు తెలంగాణ అని చెప్పి.. మద్యం తెలంగాణగా మారుస్తున్నారని టీఆర్‌ఎస్‌నుద్దేశించి బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌వి దరిద్రమైన ఆలోచనలని మండిపడ్డారు.

షాపింగ్‌ మాల్స్‌లో మద్యం అమ్మకాలకు ఎలా అనుమతి ఇస్తారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ సర్కార్‌ మద్యం పాలసీలు సిగ్గు పడేలా ఉన్నాయని మండిపడ్డారు. మహిళల ఆత్మ గౌరవ సమస్య ప్రభుత్వానికి పట్టదా? అని ప్రశ్నించారు.

cm-kcr-akula-vijaya

తెలంగాణ నూతన మద్యం పాలసీని వెంటనే రద్దు చేయాలని ఆకుల విజయ డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులకు మహిళలంటే గౌరవం లేదన్నారు. ఆసియాలోనే అత్యధిక మద్యం అమ్మకాలు జరిపిన సీఎంగా కేసీఆర్‌కు అవార్డు ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.

1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతే 2019 లో టీఆర్‌ఎస్‌కు పడుతుందని ఆకుల విజయ అన్నారు. అక్టోబర్‌ 1 నుంచి వైన్‌షాపుల్లోనే కాదు షాపింగ్‌మాల్స్‌లో కూడా కోరిన మద్యం సీసాలు లభించనున్న విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana BJP Mahila Morcha President Akula Vijaya slamed CM KCR regarding Telangana's New Wines Policy. She said CM KCR thinking is nasty.. lso she questioned that How government will give permission to sell wines in shopping malls? Vijaya demanded to ban the new wines policy immediately.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి