కేసీఆర్ పాడిన పద్యాలు సూపర్..
Recommended Video

హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు మంగళవారం నాడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన...జనగాం నుండి వచ్చిన ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ చాలా ఆనందంగా వుంది. ఇక్కడ ఈ ఐదు రోజులు చక్కటి కవిత్వం, సాహిత్యం, అష్టావధానం, ఉపన్యాసాలు వింటూ సమయాన్ని గడపడం చక్కటి ఆతిథ్యం యేర్పాటు చేసారు. స్కూల్ తెలుగుని పూర్తిగా పక్కన పెడుతున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి సభలు నిర్వహించడం మంచి పరిణామం అంటు., అష్టావధానం సందర్భంలో ముఖ్య మంత్రి కేసిఆర్ పాడిన నలుగు పద్యాలు చాలా బాగా నచ్చాయి అని ఆనందాన్ని వెళ్ళబుచ్చారు.












Click it and Unblock the Notifications