తెలంగాణాలో ఎకరం అమ్మితే ఏపీలో 100ఎకరాలు కొనొచ్చు: సీఎం కేసీఆర్ సంచలనం!!

తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కి శంఖుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. చంద్రబాబు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఎకరం భూమి అమ్మితే, ఆంధ్రాకు వెళ్లి 50 ఎకరాలు కొనుగోలు చేసేలా పరిస్థితి మారిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంత భూముల ధరలు బాగా పెరిగాయని, ఏపీలో ధరలు బాగా తగ్గాయన్నారు సీఎం కేసీఆర్. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రగతి గురించి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వం ఉంటే అన్నీ సాధ్యమవుతాయి ఆయన పేర్కొన్నారు.

kcrspeach

ఏపీలో నాయకత్వ లోపం వల్ల ఇది సాధ్యం కాలేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. సమిష్టి నాయకత్వంలోనే బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రం వస్తే భూముల ధరలు పడిపోతాయని గతంలో చెప్పారని, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల వారిని సమైక్యవాదులు కన్ఫ్యూజ్ చేశారన్నారు.

కానీ పటాన్ చెరువులో అప్పట్లో భూముల ధరలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఎలా ఉన్నాయి? అంటూ ప్రశ్నించిన కేసీఆర్, ఇప్పుడు ఎకరం 30 కోట్ల ధర పలుకుతుందని పేర్కొన్నారు. 30 కోట్లు ధర పలుకుతున్న తరుణంలో చంద్రబాబు అన్నట్టుగా ఆంధ్ర కి వెళ్లి 100 ఎకరాలు కొనుగోలు చేయవచ్చని కెసిఆర్ తెలిపారు.

గతంలో ఆంధ్రాలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో ఐదు ఎకరాలు కొనుగోలు చేయవచ్చని భావించేవారని, ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనుగోలు చేసేలా ఎదిగామని పేర్కొన్నారు. ఇంత అభివృద్ధి కి కారణమైన తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆదరించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+