మోదీ ప్రభుత్వానికి తెలిసింది దేశాన్ని అమ్మడం.. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం : కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్ నిప్పులు
కేంద్ర బడ్జెట్ 2022-23పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ బడ్జెట్ ఒక దిక్కుమాలిన తనంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని అమ్మేయడమే బీజేపీ ప్రభుత్వానికి తెలుసని దుయ్యబట్టారు. బీజేపీ పాలన అంటేనే.. అమ్మడం.. ప్రజల మధ్య కుల, మతాల చిచ్చు పెట్టడమే వారికి తెలుసని విరుచుకుపట్టారు. ఇంత దగాకోరు బడ్జెటఖను ఎప్పుడూ చూడలేదని విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం మెదడు లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు.
బడ్జెట్‌లో రైతులకు మొండి చెయి
కేంద్ర బడ్జెట్ అత్యంత దారుణంగా ఉందని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని అసలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. దేశాన్ని భష్ట్రు పట్టించేందుకు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని విరుచుకుపడ్డారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు . బడ్జెట్‌లో రైతులకు మొండి చెయి చూపించిందన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు జీరో అని ఆరోపించారు.రైతులకు క్షమాపణ చెప్పిన ప్రధాని మోదీ బడ్జెట్‌లో అదే రైతులను మర్చిపోయారని విమర్శించారు.

లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు
బీజేపీ ప్రభుత్వానికి దేశాన్ని అమ్మేయడమే తెలుసని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేశారని.. ఎల్ఐసీని కూడా అమ్మేస్తామని బడ్జెట్‌లోనే కేంద్రం స్పష్టం చేసిందన్నారు. ఎదైనా నష్టం వస్తే అమ్మాలి కానీ.. మంచి లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారో దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
దేశాన్ని భ్రష్టు పట్టిస్తోంది
దేశ ప్రజల మధ్య మతాల చిచ్చుపెట్టి.. బీజేపీ రాజకీయ పబ్బం గడుపుతుందని కేసీఆర్ ఆరోపించారు. నాలుగు ఓట్ల కోసం దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. దేశ అస్తుల్ని అమ్మడం.. దానికోసం డ్రామాలు చేయడం.. బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి వేలాది కోట్లు తీసుకుని ముంచినోళ్లకు ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుందన్నారు. రీఫార్మ్ పేరుతో , విద్యుత్ సంస్కరణల పేరుతో తన అనుచరుల జేబులు నింపే ప్రయత్నిం చేస్తుందని విమర్శించారు.

నదుల అనుసంధానం జోక్ ఆఫ్ ది మిలీనియం
నదుల అనుసంధానం జోక్ ఆఫ్ ది మిలీనియం అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. గోదావరి తెలుగురాష్ట్రాల్లోకి వచ్చాక సంపూర్ణ అధికారం మాకే ఉంటుందన్నారు . ఏ అధికారంతో గోదావరి కృష్ణ, కావేరీలను అనుసంధానం చేస్తామంటున్నారని నిలదీశారు. రైతులు, పేదలు, దళితులపై కేంద్రానికి ప్రేమ లేదన్నారు. ఒక్క రాష్ట్రం ఖర్చు పెట్టేంతలో కూడా దళితులకు కేంద్రం బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. తెలంగాణలో దళిత బంధు కింద ఒక్కొక్కరికీ రూ.15 లక్షలు ఇస్తున్నామన్నారు. దేశంలో ఇలా ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. 317 జీవో ఎంత గొప్పదో మీకు తెలుసా..? అని బీజేపీని నిలదీశారు. తెలంగాణ గ్రోత్‌లో టాప్ ప్లేస్‌లో ఉందన్నారు కేసీఆర్.
Recommended Video

దేశంలో సమూలమైన మార్పులు రావాలి
దేశంలో సమూలమైన మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కేసీఆర్. పోరాటం చేయకపోతే ఏదీ సాధించలేము. దేశంలో అన్ని వనరులు ఉన్నాయి... కానీ ఎందుకు సక్రమంగా వినియోగించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు చాలా దారుణంగా ఉంది. కేంద్రం ఏం చేస్తున్నా నోరు మూసుకుని ఉంటామనుకొవద్దన్నారు. కచ్చితంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. దేశ యువత మేల్కోవాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications