సీఎం కేసీఆర్ లెటర్ హెడ్ 45వేలకు కొనుగోలు...ఆపై సంతకం ఫోర్జరీ
ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ లెటర్‌హెడ్‌ను దొంగిలించి ఆపై ఆయన సంతకం ఫోర్జరీ చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.రాయదుర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సీఎం లెటర్ హెడ్ పై ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసీ ప్రభుత్వ భూమినే కొట్టివేయాలని ప్లాన్ వేశారు. విషయం తెలియడంతో వారిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని లగ్జరీ ఏరియాల్లో ఒకటైన గచ్చిబౌలిలో రెండు ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయాలని చేయాలని స్థానిక ఆర్డీవోకు ధరఖాస్తు చేసుకున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా సీఎం లెటర్ హెడ్‌పై ఆయన సంతకాన్ని చూసిన రెవెన్యు అధికారులు షాక్‌కు గురయ్యారు. సంతకాన్ని పూర్తిగా పరీశీలించారు. దీంతో ఆ సంతకం ఫోర్జరీ అని తేలింది. దీంతో వెంటనే మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రెవెన్యు అధికారులు . కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయాలు బయటపడ్డాయి.
సీఎం సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తులు సీం లెటర్‌హెడ్ ను ఓ టీఆర్ఎస్ నేత వద్ద రూ 45వేలకు కొనుగోలు చేశారు. దీంతో సీఎం లెటర్ హెడ్ తమ చేతికి వచ్చిందని భావించిన యువకులు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ గచ్చిబౌలిలోని రెండు ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయాలని ధరఖాస్తు చేసుకున్నారు. అనంతరం దానిపై రెవెన్యు అధికారులపై ఒత్తిడి కూడ తెచ్చారు. ఏదీ ఏమైన సీఎం లెటర్ హెడ్‌లు ఇంత బహిరంగంగా
లభిస్తున్నాయా అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications