హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం పై సీఎం కేసీఆర్ ఫైర్ - సమాజ ఐక్యతకు ప్రమాదం : అగ్రగామిగా రాష్ట్రం..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు కేంద్రం తీరు పైన ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ పైన కేంద్రం వివక్ష చూపుతోందంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో అన్నిరంగాలకు నిరంతరాయంగా, రైతులకు ఉచితంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పేందుకు గర్విస్తున్నానన్నారు. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్‌ వినియోగం 1,110 యూనిట్లు కాగా.. ఇప్పుడది 2012 యూనిట్లకు పెరిగిందన్నారు. దేశాన్ని నడిపించటంలో వైఫల్యం ఎవరిదని ప్రశ్నించారు.

ఏకైక రాష్ట్రంగా తెలంగాణ

ఏకైక రాష్ట్రంగా తెలంగాణ

ఇది జాతీయ తలసరి వినియోగంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర తలసరి విద్యుత్‌ వినియోగం 73శాతం అధికంగా ఉన్నదని వివరించారు. ఇక, కేంద్రం తీరు పైన మాట్లాడిన ముఖ్యమంత్రి...రాష్ట్రాలను ఆర్దికంగా బలహీనపర్చే కుట్ర చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. రాష్ట్రాలపైన ఆర్దిక ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేసారు. కేంద్ర వైఖరి తెలంగాణకు గుదిబండగా మారిందన్నారు. కేంద్రం కారణంగా ఏడాదికి అయిదు వేల కోట్ల నష్టం జరుగుతోందని చెప్పారు. సంస్కరణల పేరుతో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం సూచిస్తోంది..అందుకు తాను సిద్దంగా లేనని కేసీఆర్ తేల్చి చెప్పారు. దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని హెచ్చరించారు. దేశంలో మతపిచ్చి తప్ప మరేదీ లేదని వాపోయారు. సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు.

Recommended Video

Telangana Formation Day 2020 : TDP Leader Comments On KCR Governance | Oneindia Telugu
కేంద్రం తీరుపై ఆగ్రహం..ఇలాగే ఉంటే

కేంద్రం తీరుపై ఆగ్రహం..ఇలాగే ఉంటే


అశాంతి ఇలాగే ఉంటే పెట్టుబడులు రావని హెచ్చరించారు. ఉన్న పెట్టుబడులు వెనక్కు వెళ్లే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. దేశం కోలుకోవటానికి మరో వందేళ్లు పట్టినా ఆశ్చర్య పోవక్కర్లేదని చెప్పుకొచ్చారు. దేశంలో ప్రగతి పరుగులు పెట్టాలంటే నూతన విధానాలు కావాలని అభిప్రాయపడ్డారు. కొత్త సామాజిక ఆర్దిక రాజకీయ అజెండా అవసరమని.. దీని కోసం పని చేయాలని సూచించారు. బలమైన కేంద్రం - బలహీనమైన రాష్టాలు అనేలా ఉందంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రాలను ఆర్దికంగా బలహీనపర్చే కుట్ర జరుగుతోందన్నారు. తెలంగాణ ఏర్పడిన వెనువెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికపై మిషన్‌ భగీరథ పథకాన్ని సాధించిందని చెప్పారు. నేడు రాష్ట్రంలోని వందశాతం ఆవాసాల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షిత మంచినీరు సరఫరా కావడం తనకు సంతోషం కలిగిస్తోందని సీఎం పేర్కొన్నారు. అతితక్కువ బృహత్తరమైన పథకాన్ని పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించింది

ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించింది


75 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను 8ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రం సాధించిందని ముఖ్యమంత్రి వివరించారు. ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి.. నేటి స్థితిగతులకు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యమని చెప్పారు. ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగులలో, విద్యుత్‌ సరఫరా, తాగు, సాగునీటి సదుపాయం, ప్రజసంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలతో పాటు అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలువడం మనందరికీ గర్వకారణమంటూ సీఎం చెప్పుకొచ్చారు.అస్థిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి నేడు ప్రపంచం ముందు సగర్వంగా నిలిచిందన్నారు. ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో దేశానికే దిశానిర్దేశం చేసే కరదీపగా మారిందని చెప్పారు. కఠిన, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకున్నామని... 2014-2019 వరకు 17.24శాతం సగటు ఆర్థిక వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని సీఎం కేసీఆర్ వివరించారు.

English summary
CM KCR slams Central govt in state firmation day celebrations, CM Says he is not ready to implement meters for farmers motors as a part of central policy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X