కేసీఆర్ మరోసారి అదే సెంటిమెంట్ తో - కలిసొస్తే హ్యాట్రిక్ ఖాయం..!!

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. హ్యాట్రిక్ లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అటు కాంగ్రెస్ ఈ సారి గెలుపు ఖాయమనే నమ్మకంతో ఉంది. బీజేపీ సైతం ముందుకు వస్తోంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తన సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు. తన సెంటిమెంట్ ను ఈ సారి కొనసాగిస్తున్నారు. అది నిజమైనే కేసీఆర్ కు హ్యాట్రిక్ విజయం ఖాయమనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.

కేసీఆర్ ద్విముఖ వ్యూహం : వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమాన్ని కొనసాగిస్తూనే..ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా కొత్త పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నారు. తొలుత ఈ నెల 16న వరంగల్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్న ఆయన ఆ తర్వాత వరుస ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. పూర్తిస్థాయిలో అభ్యర్ధులను ప్రకటించి అన్ని నియోజకవర్గాలను చుట్టేలా ప్రణాళిక ఖరారు చేస్తున్నారని సమాచారం.

CM KCR to announce key decisions in Public meeting at waranal on 16th October ahead Elections

అయితే వరంగల్‌నుంచి సభలు మొదలుపెట్టి రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు బీఆర్‌ఎస్‌కు సెంటిమెంట్‌ ఉన్నది. బీఆర్‌ఎస్‌ పార్టీ వరంగల్‌లో ఎప్పుడు సభ నిర్వహించినా భారీగా సక్సెస్‌ అవుతుంది. సీఎం కేసీఆర్‌కు కూడా వరంగల్‌ ఒక సెంటిమెంట్‌ కావడంతో.. అక్కడే మేనిఫెస్టోను ప్రకటించాలని భావిస్తున్నారు.

వరంగల్ సెంటిమెంట్ : వరంగల్ సభలోనే సమర శంఖారావం పూరించనున్నారు. అప్పటిలోగా ఎన్నికల షెడ్యూల్‌ కూడా వచ్చే అవకాశం ఉండటంతో.. వరంగల్‌ సభ పూర్తిగా పార్టీ కార్యక్రమంగా సాగనున్నది. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన తాజా ఓటర్ల తుది జాబితాలో మహిళా ఓటర్లే 76 నియోజకవర్గాల్లో మెజార్టీలో ఉన్నారు. ఆయా నియోజకవర్గాలలో గతంలో కూడా మహిళా ఓటింగ్‌ శాతమే ఎక్కువగా నమోదైంది.

CM KCR to announce key decisions in Public meeting at waranal on 16th October ahead Elections

దీంతో వారిని ఆకట్టుకుంటే తప్పకుండా గెలుపు సాధ్యం అవుతుందని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. మహిళలే లక్ష్యంగా భారీ పథకాలు ప్రకటించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. దసరా కానుకగా మేనిఫెస్టోను ప్రకటిస్తారని.. ఆ తర్వాత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ పరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

కాంగ్రెస్ పథకాలకు ధీటుగా : కాంగ్రెస్ ప్రకటించిన హామీల అమలు సాధ్యాసాధ్యాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు కష్టసాధ్యమేనని ఆర్ధిక వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని ప్రజలకు వివరిస్తూనే పెన్షన్ ల మొత్తాన్ని పెంచేందుకు దాదాపు నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. నిరుద్యోగ భృతి...రైతు బంధు పెంపు..రైతు రుణ మాఫీ వంటి అంశాల పైన నిర్ణయం తీసుంటారని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన వంట గ్యాస్ సబ్సిడీ ప్రకటనకు ధీటుగా కొత్త పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ సభలో ప్రజల ముుందుకు వస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, ఈ సభలో కేసీఆర్ చేసే ప్రకటనల పైన ఆసక్తి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+