నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్ ... కిలో 16తులాల బంగారం స్వామివారికి; షెడ్యూల్ ఇలా!!
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదాద్రి పర్యటన చేయనున్నారు. సతీ సమేతంగా యాదాద్రి కి వెళ్లనున్న సీఎం కేసీఆర్ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకోనున్నారు. అనంతరం ప్రధాన ఆలయం దివ్య విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించడానికి ఇస్తానని ప్రకటించిన కిలో 16 తులాల బంగారాన్ని కెసిఆర్ స్వామివారికి సమర్పిస్తారు. నేడు సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో షెడ్యూల్ ఇలా ఉంది.

సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన షెడ్యూల్ ఇదే
రోడ్డు మార్గంలో ప్రగతి భవన్ నుంచి బయలుదేరి యాదాద్రికి చేరుకుంటారు సీఎం కేసీఆర్. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు యాదాద్రి లోని ప్రెసిడెన్షియల్ సూట్ కు సీఎం కేసీఆర్ దంపతులు చేరుకుంటారు. అక్కడినుండి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి ఒక కిలో 16 తులాల బంగారాన్ని కేసీఆర్ దంపతులు సమర్పిస్తారు. సీఎం కేసీఆర్ తో పాటుగా స్వామి వారి ప్రధాన ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించడానికి మరికొందరు బంగారాన్ని విరాళంగా అందజేస్తారని యాదాద్రి ఈవో గీత తెలిపారు.

జాతీయ పార్టీ ప్రకటన ఆలోచనలో కేసీఆర్
అనంతరం మధ్యాహ్నం ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు భోజనం చేసిన తర్వాత మూడు గంటల 30 నిమిషాలకు కెసిఆర్ తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమవుతారు. జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న కేసీఆర్ దసరా రోజున జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో సీఎం కెసిఆర్ యాదాద్రి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. లక్షీ నరసింహ స్వామి ఆశీస్సులతో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించాలని భావిస్తున్నారు.

సీఎం హోదాలో కేసీఆర్ యాదాద్రి పర్యటన ఇది 21వ సారి
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ముందు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలని సీఎం భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన యాదాద్రి స్వామివారిని నేడు దర్శించుకోనున్నారు. సీఎం పర్యటన నేపధ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక దసరా రోజు కేసీఆర్ కీలక క్యాబినెట్ భేటీ నిర్వహించి జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. దానికి ముందు యాదాద్రి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ యాదాద్రి కి వెళ్లడం ఇది 21వ సారి కావడం గమనించవలసిన అంశం.












Click it and Unblock the Notifications